భారత మహిళల జట్టు ఆసియాకప్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన తొలి సెమిఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత మహిళలు పది వికెట్ల తేడా విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ లక్ష్యంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత జట్టు రెండో సెమిఫైనల్‌లో విజయం సాధించే జట్టుతో ఫైనల్‌లో తలపడనుంది. దంబుల్లాలోని రణగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్లు 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది.
విజయానందంలో భారత మహిళల జట్టు సభ్యులు
భారత మహిళల జట్టు ఆసియాకప్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన తొలి సెమిఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత మహిళలు పది వికెట్ల తేడా విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ లక్ష్యంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత జట్టు రెండో సెమిఫైనల్‌లో విజయం సాధించే జట్టుతో ఫైనల్‌లో తలపడనుంది. దంబుల్లాలోని రణగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్లు 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళలు జట్టు భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. ఓపెనర్లు డియారా అక్తర్ 6(4), ముర్సిద్ ఖతున్ 4 (9), ఇస్మా తాంజిమ్ 8 (10) వికెట్లను కోల్పోవడంతో బంగ్లాదేశ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ తరువాత వచ్చిన కెప్టెన్ నిగార్ సుల్తానా 51 బంతుల్లో 32 పరుగులు చేసి పోరాటాన్ని సాగించింది. కెప్టెన్ టెయిలండర్‌గా సోర్నా అక్తర్ 19(18) నుంచి కాస్త సహకారం అందడంతో నామమాత్రపు స్కోరైనా బంగ్లాదేశ్ జట్టు చేయగలిగింది. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. రుమానా అహ్మద్ 1(11), రేబియా ఖాన్ 1 (7), రుతు మొని 5 (6), నహిదా అక్తర్ 0 (2), మారుఫా అక్తర్ 0(3) వికెట్లను బంగ్లాదేశ్ జట్టు వెంట వెంటనే కోల్పోయింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడేసి వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్ర్తాకర్ ఒక్కో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా బ్యాటర్లు ఆడుతూ, పాడుతూ చేధించారు. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించారు. భారత జట్టు బ్యాటర్లలో సఫాలీ వర్మ 28 బంతుల్లో రెండు ఫోర్లు సహాయంతో 26 పరుగులు చేయగా, స్మృతి మంథాన 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 55 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. రెండో సెమిఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో భారత మహిళల జట్టు ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.