అమెరికాకు వెళ్తున్న భారత ఆటగాళ్లు.. టి20 వరల్డ్ కప్ కోసమే

ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. రెండు నెలల పాటు నిర్విరామంగా క్రికెట్ ఆడిన భారత ఆటగాళ్లు మరో కీలక టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టి20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు భారత జట్టు ఆటగాళ్లు అమెరికాకు వెళుతున్నారు. మూడు దశల్లో టీమిండియా ఆటగాళ్లు అమెరికాకు వెళుతున్నారు.

భారత జట్టు ఆటగాళ్లు

భారత జట్టు ఆటగాళ్లు



ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. రెండు నెలల పాటు నిర్విరామంగా క్రికెట్ ఆడిన భారత ఆటగాళ్లు మరో కీలక టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టి20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు భారత జట్టు ఆటగాళ్లు అమెరికాకు వెళుతున్నారు. మూడు దశల్లో టీమిండియా ఆటగాళ్లు అమెరికాకు వెళుతున్నారు. ఐపీఎల్ ముగించుకున్న ఆటగాళ్లు తొలి దశలో శనివారం అమెరికాకు పయనమై వెళ్లారు. తొలి బ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ట్ ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్య, అర్షదీప్ తదితరులు ముంబై నుంచి విమానం ఎక్కారు. రెండో బ్యాచ్ లో యశస్వి జైస్వాల్, సంజు సాంసన్, యజ్వేందర్ చాహల్, రింకు సింగ్ వెళ్ళనున్నారు. హార్దిక్ పాండ్యా లండన్ లో ఉండడంతో అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళతారు. మూడో దశలో మిగిలిన ఆటగాళ్లు అమెరికాకు వెళతారని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టి20 వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు అమెరికాకు వెళుతోంది. కోట్లాదిమంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ను అందించేందుకు భారత జట్టు సన్నద్ధమైంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్