భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళింది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టు మ్యాచ్ లు ఓటమి తర్వాత యువ భారత జట్టు టి20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టింది. దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా శుక్రవారం ఆ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. టి20 వరల్డ్ కప్ ఛాంపియన్ హోదాలో భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి పరాభవం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి మ్యాచ్ లోనే భారత్ కు షాక్ ఇవ్వాలని భావిస్తోంది.
ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు సూర్య కుమార్ యాదవ్, మార్క్రమ్
భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళింది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టు మ్యాచ్ లు ఓటమి తర్వాత యువ భారత జట్టు టి20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టింది. దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా శుక్రవారం ఆ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. టి20 వరల్డ్ కప్ ఛాంపియన్ హోదాలో భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి పరాభవం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి మ్యాచ్ లోనే భారత్ కు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఇటీవల 3 టెస్ట్ మ్యాచ్లో ఓటమితో భారత అభిమానులు తీవ్ర నిరాశలో కూరుపోయారు. తొలి టీ-20 మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా అభిమానులను ఆనంద పరచాలని యువ భారత జట్టు భావిస్తోంది. తొలి టీ-20 మ్యాచ్లో కొన్ని మార్పులతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్లుగా సంజు సాంసన్, అభిషేక్ బరిలోకి దిగనున్నారు. వీరి ప్రదర్శన పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో శాంసన్ అద్భుతంగా రాణించాడు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఈ సిరీస్ లో రాణిస్తే భారత జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంటుంది. చిలక్కవరం కూడా రెగ్యులర్ బెర్త్ ను ఆశిస్తున్నాడు. ఇక అర్షదీప్, ఆవేశ్, వైషాక్, యశ్ లకు తొలిసారిగా చోటు కల్పించారు. వీరు ఏ స్థాయిలో రాణిస్తారు అన్నది ఆసక్తి నెలకొంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు కూడా పటిష్టంగానే ఉంది. ఐర్లాండ్, వెస్టిండీస్ పై ఓటముల తర్వాత ఆ జట్టుపై ఒత్తిడి ఉంది. అదే సమయంలో గెలుపు బాట పట్టడం ద్వారా సత్తాను చాటాలని ఆ జట్టు భావిస్తోంది. మిడిల్ ఆర్డర్లో క్లాసేన్, మిల్లర్ రాకతో బ్యాటింగ్ విభాగం బలోపేతమైంది. వీరికి జతగా స్టబ్స్ ఉన్నాడు. మరోవైపు ప్యాచర్లు జాన్సన్, కొట్జీ జట్టులో చేరడంతో ఫేస్ విభాగం బలోపేతం అయింది. డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది
ఇవి జట్లు అంచనా
భారత్ : సంజు సాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రామన్ దీప్, అక్షర్ పటేల్, బిష్ణోయ్, అర్ష్ దీప్, ఆవేష్
దక్షిణాఫ్రికా జట్టు
రికెల్టన్, హెన్రిక్స్, మార్క్రమ్ (కెప్టెన్), స్టెప్స్, మిల్లర్, క్లాసన్, క్రుగెర్, జాన్సన్, కేశవ్, బార్ట్ మాన్, కొట్జీ