అండర్ 19 ఆసియా కప్ 2025 వన్డే టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌లో శ్రీలంకతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్రతీకాత్మక చిత్రం
సెమీస్‌లో శ్రీలంకపై భారత్ విజయం
బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్థాన్ జట్టు
రేపు ఫైనల్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్
అండర్ 19 ఆసియా కప్ 2025 వన్డే టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌లో శ్రీలంకతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించగా. భారత కుర్రాళ్లు ఆరోన్ జార్జ్(49 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), విహాన్ మల్హోత్రా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. కెప్టెన్ విమత్ దిన్సారా(29 బంతుల్లో 4 ఫోర్లతో 32), చమికా హీనాటిగలా(38 బంతుల్లో 3 ఫోర్లతో 42) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హెనిల్ పటేల్, కాన్షిక్ చౌహన్ రెండేసి వికెట్లు తీయగా.. కిషన్ సింగ్, దీపేష్ దేవండ్రన్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం భారత అండర్ 19 టీమ్ 18 ఓవర్లలో 2 వికెట్లకు 139 పరుగులు చేసి మరో 12 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. కెప్టెన్ ఆయుష్ మాత్రే(7)తో పాటు వైభవ్ సూర్యవంశీ(9) విఫలమైనా.. ఆరోన్ జార్జ్(49 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), విహాన్ మల్హోత్రా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో రసిత్ నిమ్సారా(2/31) ఒక్కడే రెండు వికెట్లు తీసాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో విహాన్ మల్హోత్రాను ఆర్‌సీబీ రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ అండర్ 19 టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 121 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ 16.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 122 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.