భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. నేడు సెమీస్ సన్నాహక మ్యాచ్.!

ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ రెండు జట్లు చివరిసారిగా గడిచిన వరల్డ్ కప్ లో తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ తో పాటు సెమీస్ లో కూడా భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించే విజయాలు అందుకుంది. అంతకుముందు కివీస్ తో జరిగిన మూడు వన్డేల్లో కూడా టీమిండియా పై చేయి సాధించింది. అయితే ఇటీవల భారత్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆ జట్టు కొట్టిన దెబ్బ ఇంకా తాజా గానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరగనున్న మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ ఈ పోరు సెమీస్ సన్నాహక మ్యాచ్ గా ఇరుజట్లు భావిస్తున్నాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ రెండు జట్లు చివరిసారిగా గడిచిన వరల్డ్ కప్ లో తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ తో పాటు సెమీస్ లో కూడా భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించే విజయాలు అందుకుంది. అంతకుముందు కివీస్ తో జరిగిన మూడు వన్డేల్లో కూడా టీమిండియా పై చేయి సాధించింది. అయితే ఇటీవల భారత్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆ జట్టు కొట్టిన దెబ్బ ఇంకా తాజా గానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరగనున్న మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ ఈ పోరు సెమీస్ సన్నాహక మ్యాచ్ గా ఇరుజట్లు భావిస్తున్నాయి. గ్రూప్ లో చివరి మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో సెమీస్ చేరుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. 

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికీ సెమీఫైనల్ చేరిన భారత జట్టు.. చివరి లీగ్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడేందుకు సన్నద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో నెగ్గిన ఈ రెండు జట్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలిస్తే గ్రూప్ టాపర్గా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఓడితే మాత్రం దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాల్సి వస్తుంది. గడిచిన రెండు మ్యాచ్ల్లో ప్రత్యర్ధులను తక్కువ స్కోరులకే పరిమితం చేసిన భారత జట్టు లక్ష్యాలను సునాయాసంగా చేదించింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల ప్రదర్శనను బట్టి చూస్తే జట్టు ఆటగాళ్లు అంతా ఫామ్ లో ఉండడంతో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ అవకాశం ఇచ్చే ఆలోచన టీమ్ మేనేజ్మెంట్ కు ఉంది. వికెట్ కీపర్ గా రాహుల్ స్థానంలో రిసబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ తరువాత ఒకేరోజు విరామంతో సెమీఫైనల్ ఆడాల్సి ఉండడంతో ప్రధాన పేసర్ షమీకి విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో అర్ష్ దీప్ ఆడవచ్చు. న్యూజిలాండ్ జట్టు టాప్ 8లో ఐదుగురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్సర్ స్థానంలో సుందర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రిషబ్ పంత్ బరిలోకి దిగితే అక్షర్ బ్యాటింగ్ అవసరం కూడా టీమ్ ఇండియాకు అంతగా ఉండకపోవచ్చు. మరోవైపు కుల్దీపు స్థానంలో వరుణ్ చక్రవర్తిని కూడా ఆడిస్తే అతని వండే ప్రదర్శనను అంచనా వేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్ లతో టాప్-4 పటిష్టంగా ఉంది. పాండ్యా, జడేజా జట్టుకు అదనపు బలంగా మారుతున్నారు. 

అదే జట్టుతో బరిలోకి దిగే ఛాన్స్ 

న్యూజిలాండ్ జట్టు కూడా అన్ని రంగాల్లో ప్రతిష్టంగా కనిపిస్తోంది. జట్టులో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. రచిన్, యంగ్, లాథమ్ ఇప్పటికే సెంచరీలు సాధించగా, కాన్వే కూడా ఫామ్ లో ఉన్నాడు. సీనియర్ బేటర్ విలియమ్సన్ కొంత ఆందోళన కలిగిస్తోంది. గతంలో కీలక మ్యాచుల్లో భారత జట్టు పై రాణించిన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ తన స్థాయికి తగినట్టు ఆడితే ఆ జట్టుకు తిరిగి ఉండదు. గ్రాన్ ఫిలిప్ లాంటి ఆల్ రౌండర్ జట్టుకు మరింత కీలకం. జేమిసన్, రోర్కె, హెన్సీలతో ఫేస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. న్యూజిలాండ్ స్పిన్ కూడా బలంగా ఉండటం విశేషం. సాంటర్న్, బ్రేస్ వెల్ చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. 

ఇవి జట్లు అంచనా 

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్) గిల్, కోహ్లీ, అయ్యర్, పంత్, పాండ్యా, జడేజా, సుందర్, రాణా, వరుణ్, అర్ష్ దీప్ 

న్యూజిలాండ్ జట్టు అంచనా..

సాంటర్న్ (కెప్టెన్), కాన్వే, రచిన్,  విలియమ్సన్, లాథమ్, ఫిలిప్స్, మిచెల్, బ్రేస్ వెల్, జేమీ సన్, హెన్రీ, రూర్కే


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్