భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టి20 సిరీస్ షురూ.! ఎక్కడెక్కడ మ్యాచులు జరుగుతాయంటే.?

ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో టి20 సిరీస్ కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్.. ఛాంపియన్ ట్రోఫీకి ముందు జరుగుతుండడంతో కీలకంగా మారింది. ఈ సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్లు కోల్కతా, చెన్నై, రాజ్కోట్, పూణే, ముంబై నగరాల్లో మ్యాచులు జరగనున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే తమ టీమ్ సభ్యులను ప్రకటించాయి. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో టి20 సిరీస్ కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్.. ఛాంపియన్ ట్రోఫీకి ముందు జరుగుతుండడంతో కీలకంగా మారింది. ఈ సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్లు కోల్కతా, చెన్నై, రాజ్కోట్, పూణే, ముంబై నగరాల్లో మ్యాచులు జరగనున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే తమ టీమ్ సభ్యులను ప్రకటించాయి. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. 2025 ఐసిసి ఛాంపియన్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ జరుగుతుండడంతో.. సన్నాహక మ్యాచులుగా వీటిని భావిస్తున్నారు. తొలి టీ-20 మ్యాచ్ ఈనెల 22న ఏడు గంటలకు కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. రెండో టి20 జనవరి 25న 7 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. మూడో టి20 రాజ్కోట్ లోని నిరంజన్ స్టేడియంలో ఈనెల 28న జరగనుంది. నాలుగో టి20 పూనేలోని ఎంసీఏ స్టేడియంలో ఈనెల 31న జరగనుంది. చివరదైనా ఐదో టి20 ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగనుంది. అన్ని మ్యాచ్లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ తోపాటు వెబ్సైట్లోనూ చూడవచ్చు. టెలివిజన్ ప్రసారం కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, దూరదర్శన్ స్పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. 

ఇది జట్లు అంచనా..

ఇరుజట్లు ఇప్పటికే తమ ఆటగాలను ప్రకటించాయి. భారత జట్టు విషయానికి వస్తే.. సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, దృవ్ జురెల్ (వికెట్ కీపర్) 

ఇంగ్లాండ్ జట్టు అంచనా 

జోష్ బట్ల (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రహాన్ అహ్మద్, జాఫ్రా ఆర్చర్, గుస్ అటిన్క్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకేట్, జానీ ఓవర్టెన్, జామి స్మిత్ (వికెట్ కీపర్), లేయామీ లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్