భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం జరగనుంది. తొలి వన్డేలో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ విజయం సాధించిన భారత జట్టు రెండో వన్డేలోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు కోరుకుంటుంది. పేలవ ఆటతీరుతో విమర్శల పాలవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్న బట్టల షానుకు ఇది కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. అందుకే ఇటువంటి ఆ లక్ష్యం లేకుండా ఆ జట్టు ఆటగాళ్లంతా సత్తా నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.
ఇరు జట్ల కెప్టెన్లు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం జరగనుంది. తొలి వన్డేలో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ విజయం సాధించిన భారత జట్టు రెండో వన్డేలోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు కోరుకుంటుంది. పేలవ ఆటతీరుతో విమర్శల పాలవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్న బట్టల షానుకు ఇది కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. అందుకే ఇటువంటి ఆ లక్ష్యం లేకుండా ఆ జట్టు ఆటగాళ్లంతా సత్తా నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. రెండో వన్డే జరగనున్న కటక్ లో 2003 నుంచి ఇక్కడ జరిగిన ఏడు మ్యాచ్ల్లో భారత జట్టుకు ఓటమి లేదు. బలమైన రికార్డు ఉన్న భారత జట్టును ఈ మైదానంలో ఓడించడం ఇంగ్లాండు జట్టుకు అంత సులభమేమీ కాదు. ఇరుజట్లు మొదటి వన్డే ఆడిన సభ్యులతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత జట్టులో మాత్రం ఒకటి రెండు మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
మోకాలి గాయంతో తొలి వన్డే కు దూరమైన విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అతను ఫీట్ గానే ఉన్నాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ కూడా స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ రాకతో జట్టులో చోటు కోల్పోయేది ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కోకిలి స్థానంలో బరిలోకి దిగిన శ్రేయ మెరుపు అర్ద సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ కోసం ఎప్పటికీ ఇప్పుడు అయ్యర్ ను తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు అందరు చూపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై పడనుంది. నాగపూర్ లో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం చేసిన అతను 15 పరుగులే చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ కోసం జైస్వాల్ ను పక్కన పెట్టక తప్పని పరిస్థితి యాజమాన్యానికి ఏర్పడింది. అదే జరిగితే రోహిత్ శర్మకు జతగా తిరిగి గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. కానీ కోచ్ గంభీర్ వ్యూహమైన కుడి - ఎడమ కాంబినేషన్ మిస్ అవుతుంది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ను తప్పిస్తే గిల్ వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ నెంబర్-4లో ఆడతాడు. మరోవైపు విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్ ను అందుకోవాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతనికి రెండు వన్డేలు మాత్రమే మిగిలాయి. అందుకే కటక్ లో తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చావో రేవో స్థితిలో ఇంగ్లాండ్ జట్టు
టి20 సిరీస్ కోల్పోవడం, తొలి వన్డేలోనూ దారుణంగా ఓటమి పాలు కావడంతో ఇంగ్లాండు జట్టుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి నెలకొంది. రెండవ వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు ఏర్పడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు జట్టు ఆత్మవిశ్వాసం పెరగాలంటే రెండో వన్డేలో విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు ప్రతి బంతిని బాధేయాలన్న ఉద్దేశంతో ఆడుతున్నారు. ఇదే ఆ జట్టు ఇబ్బందులు పడేలా చేస్తోంది. ముందు ఎవరో ఒకరు గ్రీజులో నిలదొక్కుకుంటే మ్యాచ్ ను చివరివరకు తీసుకెళ్లవచ్చు. కోచ్ మెక్ కల్లమ్ ఆధ్వర్యంలోని ఇంగ్లాండ్ బజ్బాల్ గేమ్ ను ఎక్కువగా నమ్ముకుంటోంది. సాల్ట్, డకెట్, బ్రూక్, బట్లర్ రాణిస్తున్న.. లివింగ్ స్టోన్, రూట్ బ్యాటు గెలిపించాల్సి ఉంది. పెసర్ సఖి స్థానంలో వుడ్ ఆడే అవకాశం ఉంది. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్లో భారత్కు చెక్కు పెట్టేందుకు ఇంగ్లాండ్ ఎలాంటి ప్రణాళిక రచిస్తుందో చూడాలి.
ఆరేళ్ల క్రితం ఎక్కడ జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్ పై భారత్ 316 పరుగులను ఛేదించింది. ఆ మ్యాచ్ లో విరాట్, రోహిత్, రాహుల్ అర్థ సెంచరీలతో రాణించారు. ఈసారి కూడా పిచ్చు బ్యాటింగ్కు అనుకూలించనుంది. మంచు ప్రభావంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. బౌలింగ్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇవి జట్లు అంచనా
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జడేజా, రాణా/అర్షదీప్, కుల్దీప్ యాదవ్, షమీ
ఇంగ్లాండ్ జట్టు అంచనా
సాల్ట్, డకెట్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), బేతెల్, లివింగ్ స్టోన్, కార్స్, రషీద్, ఆర్చర్, సకీబ్/ఉడ్