భారత మహిళలు జట్టు సెమిస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచలో విజయం సాధించి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలను నిలుపుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచలో పాకిస్తాన్ జట్టు తొలుత బాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 105 పరుగులు చేసింది. 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
విజయానందంలో మహిళల జట్టు సభ్యులు
భారత మహిళలు జట్టు సెమిస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచలో విజయం సాధించి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలను నిలుపుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచలో పాకిస్తాన్ జట్టు తొలుత బాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 105 పరుగులు చేసింది. 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలు కావడంతో మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత మహిళల జట్టుకు ఏర్పడింది. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్ ఫలితం భారత్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన విజయం సాధించడం ద్వారా సెమీస్ వైపు అడుగులు వేసినట్టు అయింది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో కీలక ఆటగాళ్లు రాణించలేకపోవడంతో నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది.
పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ 17, నిడా దార్ 28, శ్యేదా అరూబ్ షా 14, కెప్టెన్ ఫాతిమా 13 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు, దీప్తి శర్మ మూడు, ఆరుందతీ రెడ్డి, శ్రేయాంకా పాటిల్ ఒక్కో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆచితూచి ఆడుతూ లక్ష్యం వైపు వెళ్లారు. ఓపెనర్ స్మితా మంధాన మరోసారి ఫెయిల్ అయింది. 16 బంతులు ఆడి ఏడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టింది. ఆ తరువాత వన్‌డౌన్‌లో వచ్చిన జిమ్మీ రోడ్రిగస్(23)తో కలిసి మరో ఓపెన్ సఫాలీ వర్మ ఇన్నింగ్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ కలిపి 43 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో 11.5 ఓవర్‌లో 32 పరుగులు చేసిన సఫాలీ వర్మ ఔట్ అయింది. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ క్రౌర్ 29 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. పాకిస్తాన్ బౌలర్లలో కెప్టెన్ పాతిమా రెండు వికెట్లు తీయగా, సదియా ఇక్బాల్, ఒమైనా సోహిల్ ఒక్కో వికెట్ తీశారు.