విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. సౌతాఫ్రికాతో నేడు మూడో టి20

నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు బుధవారం మూడో టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా జట్టుపై ఒత్తిడి పెంచి సిరీస్ విజయాన్ని దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. తొలి టీ20లో ఓటమి పాలైనప్పటికీ రెండో టి20 మ్యాచ్ లో చివరి వరకు పోరాడి విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు కూడా మూడో టి20 మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

Captains Markram and Suryakumar of both teams

ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్లు మార్క్రమ్, సూర్యకుమార్

నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు బుధవారం మూడో టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా జట్టుపై ఒత్తిడి పెంచి సిరీస్ విజయాన్ని దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. తొలి టీ20లో ఓటమి పాలైనప్పటికీ రెండో టి20 మ్యాచ్ లో చివరి వరకు పోరాడి విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు కూడా మూడో టి20 మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇరుజట్లు బలంగా ఉండడంతో మూడో టి20 పోరు ఆసక్తికరంగా సాగనుంది. రెండో టి20 లో భారత ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. నామమాత్రపు స్కోర్ చేసినప్పటికీ  బౌలర్లు అద్భుతంగా రాణించడంతో చివరి ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది. రెండో టి20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు చేసిన తప్పిదాలకు అవకాశం లేకుండా మెరుగ్గా ఆడితే మంచి ఫలితాన్ని రాబట్టవచ్చు. భారత జట్టు ఈ మ్యాచ్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ రాణించకపోవడంతో మిగిలిన ఆటగాళ్లపై ప్రభావం పడుతుంది.

వరుసగా విఫలమవుతుండడంతో అతడిని కొనసాగించే అవకాశం లేదని చెబుతున్నారు. అభిషేక్ శర్మను పక్కనపెడితే తిలక్ వర్మ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. కెప్టెన్ మార్క్రంతోపాటు క్లాసేన్, మిల్లర్ రాణించడం పై జట్టు ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురు తొలి రెండు మ్యాచుల్లో విఫలం కావడంతో దక్షిణాఫ్రికా జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చివరి రెండు టీ20 మ్యాచ్లో గెలవాలి అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు తమదైన స్థాయిలో రాణించాల్సి ఉంది. మూడో టి20 జరగనున్న సెంచూరియన్ పార్కు మైదానం పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ బ్యాటర్లు పరుగులు సాధించడం కొంత కష్టమనే చెప్పాలి. అదనపు బౌన్స్ స్పిన్నర్ కు అనుకూలిస్తుంది. దాస్ గెలిచినట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

ఇవి జట్లు అంచనా

భారత జట్టు : సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర పటేల్, రింకు సింగ్, రామన్దీప్ సింగ్, అర్ష్ దీప్, బిస్నోయ్, ఆదేశ్, వరుణ్ చక్రవర్తి 

దక్షిణాఫ్రికా జట్టు అంచనా : 

హెన్రిక్స్, రికెల్టన్, మార్క్రం (కెప్టెన్), స్టబ్స్, క్లాసన్, మిల్లర్, జాన్సన్, కేశవ్, కొట్జీ, సిమలానే, షిఫామ్ల


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్