న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. అయితే రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడుతున్నాడు.
ముంబై, ఈవార్తలు : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. అయితే రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడుతున్నాడు. అవతలి ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ సహకారంతో లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇంకా 41 పరుగులు చేస్తే టీమిండియా గట్టెక్కుతుంది. అయితే, న్యూజిలాండ్‌కు ఇంకా 4 వికెట్లే అవసరం అయ్యాయి. అజాజ్ పటేల్ స్పిన్ మాయాజాలంతో టీమిండియా నడ్డి విరుస్తున్నాడు. నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 5, రోహిత్ శర్మ 11, శుభ్‌మన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 1, సర్ఫరాజ్ ఖాన్ 1, రవీంద్ర జడేజా 6 పరుగులే చేసి ఘోరంగా విఫలం అయ్యారు. ఇంకా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.. బరిలోకి దిగాల్సి ఉంది.
రిషబ్ పంత్ ఒక్కడే టీమిండియా తరఫున హాఫ్ సెంచరీ చేశాడు. 49 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 56 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా 102/6 స్కోరు వద్ద ఉంది. వాషింగ్టన్ సుందర్ 11 బంతుల్లో 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా భారీ ఒత్తిడిలో ఉంది. కాగా, చరిత్రలో ఎన్నడూ టీమిండియా తన సొంత గడ్డపై 3-0తో వైట్ వాష్ కాలేదు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉంటుందో మరి.