ఛాంపియన్స్ సంగ్రామం షురూ.. నేటి నుంచే ఐసీసీ మెగా వన్డే టోర్నీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. బుధవారం నుంచి మార్చి తొమ్మిదో తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 8 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్ స్ట్రోఫీని నిర్వహిస్తున్నారు. 20 రోజులు పాటు క్రికెట్ అభిమానులకు పండగ. ఈ భారీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ దేశంలో జరుగుతున్న అతిపెద్ద క్రీడా డోర్ ని ఇదే కావడం. మార్చి 9వ తేదీన ఫైనల్ జరగనుంది. ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. టీమిండియా ఆడాల్సిన మ్యాచులకు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. బుధవారం నుంచి మార్చి తొమ్మిదో తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 8 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్ స్ట్రోఫీని నిర్వహిస్తున్నారు. 20 రోజులు పాటు క్రికెట్ అభిమానులకు పండగ. ఈ భారీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ దేశంలో జరుగుతున్న అతిపెద్ద క్రీడా డోర్ ని ఇదే కావడం. మార్చి 9వ తేదీన ఫైనల్ జరగనుంది. ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. టీమిండియా ఆడాల్సిన మ్యాచులకు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో హైబ్రిడ్ పద్ధతిలో దుబాయిలో మ్యాచ్లో జరగనున్నాయి. 2017లో చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు భారత జట్టును ఓడించి టైటిల్ గెలిచింది. ఆ తరువాత ఎనిమిది ఏళ్లుగా టోర్నీ జరగలేదు. శ్రీలంక తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. పాకిస్తాన్లోని అస్థిర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు నేపథ్యంలో ఛాంపియన్ స్ట్రోఫీని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలనే భావనతో ఆ దేశ బోర్డు ఉంది. ప్రస్తుతం భారతదేశం మనః అన్ని జట్లు కూడా పాకిస్తాన్ లో పర్యటించి సిరీస్ లు ఆడుతున్నాయి. 

టోర్నీ జరిగేది ఇలా..

ఛాంపియన్ స్ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూపు ఏ లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కివీస్ ఉండగా.. గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జపాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూపులో ఉండే నాలుగు జట్లు తమ ప్రత్యార్ధితో ఒక్కోసారి తలపడతాయి. రెండు గ్రూపుల్లో టాప్ -2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత టైటిల్ బోర్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ లాహోర్లో జరుగుతుంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ కు వెళితే దుబాయ్ లో జరగనుంది. 

36 కెమెరాలతో..

ఛాంపియన్స్ ట్రోఫీని వీక్షించే అభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు ఐసిసి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా స్టేడియాల్లో 36 కెమెరాలతో మ్యాచులను అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు. ఇందులో 360 డిగ్రీ కోణంలో మైదానంలో జరిగే ఆసక్తికర విశేషాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు డ్రోన్ కెమెరాల ద్వారా స్టేడియాల చుట్టుపక్కల పరిసరాల విహంగ వీక్షణను కూడా అభిమానులు ఆస్వాదించవచ్చు. రోవింగ్ భగ్గీ కామ్, స్పైడర్ కామ్ల ద్వారా ఏరియల్ కవరేజీలో మరింత నాణ్యత కనిపించనుంది. 

భారీగా నగదు బహుమతి..

టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ఈసారి భారీ మొత్తంలో నగదు బహుమతి లభిస్తోంది. విజేతకు రూ.19.4 కోట్ల రూపాయలు, రన్న రప్ గా నిలిచే జట్టుకు రూ.9.7 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. నాలుగు సెమి ఫైనలిస్టులకు రూ.4.9 కోట్లు అందుతుంది. మొత్తం ప్రైజ్ మనీ ని చూస్తే 2017తో పోలిస్తే దాదాపు 53% పెరిగింది. 

తొలి మ్యాచ్లో పోటీపడే జట్లు..

తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మధ్య తొలి మ్యాచ్ జరుగునుంది. కరాచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఇరుజట్లు తెలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి లైవ్ ప్రారంభమవుతుంది. గురువారం భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదిక జరుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్