పాండ్యా సిక్సర్.. కెమెరామెన్‌కు గాయం

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా తొలి బంతినే సిక్సర్‌ తరలించాడు.

Hardik Pandya T20 match highlights

ప్రతీకాత్మక చిత్రం

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా తొలి బంతినే సిక్సర్‌ తరలించాడు. అతను కొట్టిన ఈ బంతి నేరుగా డగౌట్‌లో ఉన్న కెమెరామెన్ ఎడమ భుజానికి బలంగా తాకింది. హార్దిక్ పాండ్యా సిక్స్‌ను గమనించని సదరు కెమెరామెన్ భారత డగౌట్‌‌ దృశ్యాలను కెమెరాతో రికార్డ్ చేస్తున్నాడు. వెంటనే ఫిజియోలు అతన్ని పరిశీలించి ఐస్‌ ప్యాక్ ఇచ్చారు. పెద్ద గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్