గౌతమ్ గంభీర్ పై విరుచుకుపడిన హార్భజన్ సింగ్.. ఎవరు పని వాళ్ళు చేసుకోవాలంటూ హితవు.!

టీమిండియా ఒకప్పటి స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకువచ్చిన 10 సూత్రాల విధానాన్ని హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో కొత్త విషయాలు ఏమీ లేవని చెప్పిన హర్భజన్.. హెడ్ కోచ్ కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ శనివారం స్పందించారు.

 Harbhajan Singh Gautam Gambhir

హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్

టీమిండియా ఒకప్పటి స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకువచ్చిన 10 సూత్రాల విధానాన్ని హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో కొత్త విషయాలు ఏమీ లేవని చెప్పిన హర్భజన్.. హెడ్ కోచ్ కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ శనివారం స్పందించారు. 'స్టార్లు, సీనియర్లు, దిగ్గజాలు.. ఇలా జట్టులో ఎంతో పేరు మోసిన క్రికెటర్లు ఉన్నా.. ఇకపై అంతా టీమిండియా సహచరులే. పెద్ద పీటలు, ప్రాధాన్యాలంటూ ఉండవు.  వెల్లడించారు. అందరూ ఒకే జట్టు.. ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బోర్డు బలంగా నిర్ణయించింది. హెడ్ కోచ్ గంభీర్ సూచనలను పరిశీలించడమే కాదు.. అమలు చేయాల్సిందేనని కృతనిచ్చేయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు అమలు చేయబోతోంది. ఈ సూత్రాలను పాటించని క్రికెటర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిలో మార్పులు చేస్తామని బీసీసీ వెల్లడించింది. చివరిగా ఐపీఎల్లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకు వెనుక ఆడబోమని బీసీసీఐ హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో హార్భజన్ సింగ్ స్పందించారు. బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదన్నారు.

సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గా తాను టీమిండియా కు ఆడుతున్న సమయంలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయన్నారు. బీసీసీఐ చెప్పినట్టుగా భావిస్తున్న పది సూత్రాలలో 9 అప్పట్లోనే ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్ని పాతవేనని స్పష్టం చేశారు. కొత్తవి అని మళ్ళీ ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ అంశంపై ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అయినా తమ టీమిండియా కు ఆడేటప్పుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినప్పుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసే వాళ్ళమని, లేదంటే నేరుగా పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్ళమని వెల్లడించారు. హెడ్ కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడని ప్రశ్నించారు. అతడు పని ఇది కాదు కదా అంటూ పేర్కొన్నారు. కేవలం మైదానాల్లో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారని అంశం మీదే అతని దృష్టి ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జట్టులో ఇదే లోపించిందని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ విషయాలను బిసిసిఐ లో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించాలని ఎవరు పని వారు చూసుకుంటే మంచిదని భజ్జీ గంభీర్ కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్  - గవాస్కర్ ట్రోఫీలో 3-1 తో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందేనని, ఇలాంటి చర్చలు ద్వారా ఆ ఓటమి విషయాన్ని పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్