దేశంలో లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్ షిప్ లో జియో హాట్ స్టార్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11 వేల కోట్ల నిమిషాల వాచ్ టైమ్ నమోదయింది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియో హాట్ స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇదే. తొలి టోర్నమెంట్ లోనే సరికొత్త రికార్డులను జియో హాట్ స్టార్ సృష్టించింది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులను జియో హాట్ స్టార్ ఆకట్టుకుంది. దీంతో ప్రతి మ్యాచ్ కూడా లక్షలాదిమంది అభిమానులు ఇందులో వీక్షించారు. భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ సుమారు 56 కోట్ల మంది అభిమానులు వీక్షించారు. న్యూజిలాండ్ మీద భారత్ గెలిచిన ఫైనల్ మ్యాచ్ అయితే ఏకంగా 124.2 కోట్లమంది వీక్షించారు.
జియో హాట్ స్టార్
దేశంలో లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్ షిప్ లో జియో హాట్ స్టార్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11 వేల కోట్ల నిమిషాల వాచ్ టైమ్ నమోదయింది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియో హాట్ స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇదే. తొలి టోర్నమెంట్ లోనే సరికొత్త రికార్డులను జియో హాట్ స్టార్ సృష్టించింది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులను జియో హాట్ స్టార్ ఆకట్టుకుంది. దీంతో ప్రతి మ్యాచ్ కూడా లక్షలాదిమంది అభిమానులు ఇందులో వీక్షించారు. భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ సుమారు 56 కోట్ల మంది అభిమానులు వీక్షించారు. న్యూజిలాండ్ మీద భారత్ గెలిచిన ఫైనల్ మ్యాచ్ అయితే ఏకంగా 124.2 కోట్లమంది వీక్షించారు. ఒక దశలో ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదయింది. గతంలో డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమైన 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు. తాజా టోర్నీలో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు 60.2 కోట్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. భారత్లో డిజిటల్ స్ట్రీమింగ్ పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయని జియో స్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మనీ తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం సహా తొమ్మిది భాషల్లోనూ, సైన్ లాంగ్వేజ్ లోనూ, ఆడియో కామెంట్రీ రూపంలోనూ అందించినట్లు వివరించారు.
గతంతో పోలిస్తే క్రికెట్ వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందులో భాగంగానే కోట్లాదిమంది లైవ్ మ్యాచ్లను వీక్షిస్తున్నారు. ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లకు కూడా అభిమానులు ఆసక్తి చూపించారు. భారత జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ను కోట్లాదిమంది వీక్షించారు. భారత్ కూడా ఈ టోర్నీలో ఎక్కడ ఓటమి లేకుండా ఫైనల్ వరకు వెళ్లడంతో పాటు విజయాన్ని సాధించింది. దీంతో లీగ్ నుంచి ఫైనల్ వరకు ప్రతి మ్యాచ్ ఆసక్తిగా మారింది. భారత్ కూడా అద్భుతమైన విజయాలను సాధిస్తూ ముందుకు వెళుతూ ఉండడంతో తదుపరి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. వివిధ పనుల్లో నిమగ్నమైనప్పటికీ తమ సెల్ ఫోన్ లో జియో హాట్స్టార్ ఓపెన్ చేసి మ్యాచ్ వీక్షించేవారు. దీంతో జియో హాట్ స్టార్ లో కోట్లాదిమంది అభిమానులు మ్యాచ్ను వీక్షించినట్లు రికార్డులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లోనూ ఈ రికార్డులు మరింతగా బద్దలు కొట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.