Team India Head Coach : టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం

టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ Gautam Gambhir నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

gambhir head coach

గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ, ఈవార్తలు : టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ Gautam Gambhir నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవిలో గంభీర్ రెండేళ్లు కొనసాగనున్నారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ Rahul Dravid పదవీకాలం ముగియటంతో ఆ స్థానంలో గంభీర్‌ను నియమించారు. శ్రీలంక సిరీస్ నుంచి గంభీర్ జట్టుతో చేరతాడు. గంభీర్ నియామకంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ.. భారత క్రికెట్‌ను మరింత ముందకు తీసుకెళ్లేందుకు గౌతమ్ గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ఆహ్వానిస్తున్నా అని ట్వీట్ చేశారు. అటు.. క్రికెట్ వర్గాల నుంచి గంభీర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

గంభీర్ ట్రాక్ రికార్డు ఇదీ..

2011 వరల్డ్ కప్ గెలిచిన టీంలో సభ్యుడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సారథిగా వ్యవహరించి 2012, 2014 టైటిల్స్‌ను సాధించాడు. రీసెంట్‌గా గంభీర్ మెంటార్‌గా వచ్చాకే కోల్‌కతా మూడో టైటిల్ కొట్టింది. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన గంభీర్.. సెహ్వాగ్‌తో కలిసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ 97 పరుగులు చేసి కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అన్నింటికన్నా ముఖ్యంగా క్రికెటర్ల ప్రతిభను గుర్తించగలడు. వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపి సక్సెస్ అయ్యాడు. ఆ దెబ్బకు ఈ ఐపీఎల్‌లో నరైన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అయితే, ధోనీపై విమర్శలు, కోహ్లీతో గొడవ లాంటి ఘటనలు గంభీర్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. యువ క్రికెటర్లతో కలిసిపోగలడా? ముక్కుసూటి వ్యక్తిత్వం క్రికెటర్లకు నచ్చుతుందా? అనేది తెలియాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్