నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం.. భారత్ జోరుకు ఇంగ్లాండ్ అడ్డుకట్ట వేసిన.!

భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. నాగపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ను 4-1 కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు వన్డే సిరీస్ లో రాణించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సర్వశక్తులను ఆ జట్టు ఒడ్డుతోంది. ఇదిలా ఉంటే వన్డే సిరీస్ కు భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో అందరి దృష్టి సీనియర్ ఆటగాళ్లపై నెలకొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై మరోసారి అందరి దృష్టి నెలకొంది. కొందరు క్రికెటర్ల ఫామ్, ఫిట్నెస్ తో పాటు కొన్ని స్థానాలకు తగిన ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఈ సిరీస్ ను సెలక్టర్లు ఉపయోగించుకోనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. నాగపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ను 4-1 కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు వన్డే సిరీస్ లో రాణించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సర్వశక్తులను ఆ జట్టు ఒడ్డుతోంది. ఇదిలా ఉంటే వన్డే సిరీస్ కు భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో అందరి దృష్టి సీనియర్ ఆటగాళ్లపై నెలకొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై మరోసారి అందరి దృష్టి నెలకొంది. కొందరు క్రికెటర్ల ఫామ్, ఫిట్నెస్ తో పాటు కొన్ని స్థానాలకు తగిన ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఈ సిరీస్ ను సెలక్టర్లు ఉపయోగించుకోనున్నారు. 14 నెలల క్రితం వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో తొలిసారి భారత జట్టు వన్డే మ్యాచ్ లో బరిలోకి దిగబోతోంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో దారుణంగా ఆడిన రోహిత్ శర్మ, కోహ్లీ ఈ వన్డేల్లో అయినా బ్యాట్ కు పని చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు తమ లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ సిరీస్ మంచి అవకాశంగా చెబుతున్నారు. ఇది ఎలా ఉంటే ఇండియన్ టీమ్ తుది జట్టు ఎంపికకు సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతోంది.

వికెట్ కీపర్ ఎవరన్నా దానిపై స్పష్టత లేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లో ఎవరిని తీసుకోవాలన్న దానిపై మేనేజ్మెంట్ సందిగ్ధంలో ఉంది. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనుండగా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ తర్వాత వికెట్ కీపర్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ లో కీపర్ గా వ్యవహరించిన రాహుల్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా రాణించాడు. అదే సమయంలో ఎడమచేతి వాటం ఆటగాడైన పంత్ జట్టులో ఉంటే వైవిధ్యంతోపాటు అతడి దూకుడైన ఆట జట్టుకు అదనపు బలముగా మారవచ్చు అని జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. ఒకవేళ ఇద్దరినీ ఆడించాలనుకుంటే మాత్రం అయ్యర్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారి వన్డేలు ఆడుతున్నాడు. గాయాలనుంచి కోలుకుని మళ్ళీ జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ ను ఈ సిరీస్ తో నిశితంగా పరీక్షించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ లో షమీ బరిలోకి దిగగా, కుల్దీప్ సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి వచ్చాడు. బుమ్రా, సిరాజ్ లేకపోవడంతో షమీ, అర్ష దిప్ పైనే బౌలింగ్ భారం ఎక్కువగా పడనుంది. జడేజా, అక్షర పటేల్, వాషింగ్టన్ సుందర్ లో ఇద్దరే ఆడే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసినా అతడిని ఆడించే అవకాశాలు తక్కువ. 

ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే టి20 సిరీస్ ఓడిన కసితో ఉంది. తొలి వన్డే లోనే భారత జట్టుకు షాక్ ఇవ్వాలన్న కసితో ఆ జట్టు ఉంది. 14 నెలలు విరామం తర్వాత జో రూట్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలం పెరగనుంది. ఈ ఒక్క మార్పు మినహా టి20 ఆడిన జట్టుతోనే దాదాపుగా ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది. జట్టులోని ఆటగాళ్లు రాణిస్తే విజయం సాధించడం సులభం అవుతుందని ఆ జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. బట్లర్, లివింగ్ స్టోన్, హ్యారి బ్రూక్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత జట్టును నిలువరించడం సులభమేనని ఆ జట్టు యాజమాన్యం యోచిస్తోంది. నాగపూర్ మైదానం స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. బ్యాటింగ్కు కూడా అనుకూలమే. ఇక్కడి తొలి ఇన్నింగ్స్ సగటు 288 పరుగులు. ఆరేళ్ల తర్వాత ఇక్కడ వన్డే మ్యాచ్ జరుగుతోంది. వాతావరణం సాధారణంగా పొడిగానే ఉంటుంది. 

ఇవి జట్ల అంచనా 

భారత జట్టు : రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్/ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్/సుందర్, కుల్దీప్, అర్స్ దీప్ సింగ్, మహమ్మద్ షమీ 

ఇంగ్లాండ్ జట్టు : 

డకెట్, ఫిల్, షాల్ట్, రూట్, హ్యారీబూక్, జోష్ బట్లర్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), లివింగ్ స్టోన్, బెత్తల్, బ్రాండన్ కార్స్, జాఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్, షాకీబ్ మహమూద్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్