ధనాధన్ క్రికెట్ కు వేళయింది. ఐపీఎల్ తరహాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న మహిళలు ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మార్చి 15 వరకు ఈ మూడో సీజన్ జరగనుంది. 2023లో తొలిసారి ఆరంభమైన డబ్ల్యూపిఎల్ గడిచిన రెండు అంచెల్లో రెండు వేదికలకే పరిమితమైంది. ఈసారి బెంగళూరు, ముంబై వేడుకలతోపాటు వడోదర, లక్నోలో కూడా మ్యాచులు. ఈ నాలుగు వేదికల్లో మొత్తంగా 22 మ్యాచులు జరగబోతున్నాయి. ఫైనల్ మ్యాచ్ ముంబైలో నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ జెయింట్స్ తో తలపడనుంది.
ట్రోఫీతో నాలుగు జట్ల కెప్టెన్లు
ధనాధన్ క్రికెట్ కు వేళయింది. ఐపీఎల్ తరహాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న మహిళలు ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మార్చి 15 వరకు ఈ మూడో సీజన్ జరగనుంది. 2023లో తొలిసారి ఆరంభమైన డబ్ల్యూపిఎల్ గడిచిన రెండు అంచెల్లో రెండు వేదికలకే పరిమితమైంది. ఈసారి బెంగళూరు, ముంబై వేడుకలతోపాటు వడోదర, లక్నోలో కూడా మ్యాచులు. ఈ నాలుగు వేదికల్లో మొత్తంగా 22 మ్యాచులు జరగబోతున్నాయి. ఫైనల్ మ్యాచ్ ముంబైలో నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ జెయింట్స్ తో తలపడనుంది. ఇరుజట్లలోనూ ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ ఫలితం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దేశవాళీ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఆరంభించిన ఈ లీగ్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు యువ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మెరిసేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఈ లీక్ ద్వారా అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. విదేశీ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కూడా వీరికి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. తొలి మ్యాచ్ ఆడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మందాన నేతృత్వం వహిస్తోంది. మరోసారి టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఆ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఈ జట్టుకు కొన్ని రకాల ఇబ్బందులు ప్రస్తుతం వేధిస్తున్నాయి. ఈ జట్టులోని కీలక ఆటగాళ్లయిన సోఫీ డివైన్ అందుబాటులో లేకపోగా, క్రాస్, మోలినెక్స్, ఆశ శోభన గాయాలతో దూరమయ్యారు. దీనికి తోడు స్టార్ ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ, శ్రేయాంక గాయాల నుంచి కోరుకుంటున్నారు. పేస్ ఆల్ రౌండర్ కశ్వీ గౌతమ్ (గుజరాత్) పై కూడా అందరి దృష్టి నెలకొంది. ఆటో రెండుసార్లు రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం షఫాలీ, లానింగ్, జమీమా, సదర్లాండ్, కాప్ లతో పటిష్టంగా కనిపిస్తోంది. యూపీ వారియర్స్ కు దీప్తి శర్మ, గుజరాత్ జెయింట్స్ కు ఆశ్లే గార్డినర్ ఈసారి కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
మహిళల ప్రీమియర్ లీగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే పురుషుల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. మరో మూడు నెలల పాటు క్రికెట్ పండగ జరగనుంది. కోట్లాదిమంది అభిమానులు ఈ మ్యాచ్లను వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుమారు నెలరోజులపాటు మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది.
ఇది మ్యాచ్లు జరిగే తీరు..
ఈ టోర్నీలో భాగంగా మొత్తం 22 మ్యాచులు జరగనున్నాయి. వీటిలో 20 మ్యాచ్లు గ్రూప్ దశలో జరుగుతాయి. ప్రతి జట్టు మిగిలిన నాలుగు జట్లతో రెండుసార్లు తలపడాల్సి వస్తుంది. ఆ తర్వాత గ్రూప్ దశలో నెంబర్ వన్ జట్టు నేరుగా ఫైనల్ కి వెళుతుంది, రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్ కు చేరుతుంది. గడిచిన రెండు సెజాలలో విజేతకు రూ.6 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వగా, రన్నర్పు జట్టుకు మూడు కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారు. అత్యధిక పరుగులు చేసి, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున లభించాయి. ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు రూ.2.5 లక్షల ఇచ్చారు.