CSK vs DC | చెన్నైపై ఢిల్లీ గెలిచినా.. రిషబ్ పంత్‌కు భారీ జరిమానా

రిషబ్ పంత్ 32 బంతుల్లోనే 51 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్, వెటరన్ స్టార్ మహేంద్రసింగ్ ధోనీ తనదైన మార్కు షాట్లతో అభిమానులను అలరించాడు.

rishab pant delhi capitals, ipl 2024
రిషబ్ పంత్ Photo: x.com

ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లు తలా మూడు మ్యాచ్‌లు ఆడేశాయి. ఒక ముంబై ఇండియన్స్ తప్ప అన్ని జట్లు ఒక్కో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. తాజాగా, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. రిషబ్ పంత్ 32 బంతుల్లోనే 51 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్, వెటరన్ స్టార్ మహేంద్రసింగ్ ధోనీ తనదైన మార్కు షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే, ఢిల్లీ మ్యాచ్ గెలిచినా వారికి ఒక చేదువార్త మిగిలింది.

మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ ఫైన్ వేశారు. లీగ్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ జరిమానా విధిస్తూ ఐపీఎల్ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇది వరకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు కూడా రూ.12 లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగానే ఈ జరిమానా విధించామని స్పష్టం చేసింది.

వెబ్ స్టోరీస్