WTC డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఎప్పుడంటే.. ?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గద Photo: Twitter ||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ పోరు తేదీలను ఐసీసీ ప్రకటించింది. రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఈ ఏడాది జూన్‌ 7న ప్రారంభం కానుందని ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఫైనల్‌కు సౌతాంప్టన్‌ ఆతిథ్యమవివ్వగా.. ఈ సారి ఇంగ్లండ్‌లోని ప్రసిద్ధ ఓవల్‌ స్టేడియంలో తుదిపోరుజరుగనుంది. ఈ మేరకు ఐఈసీస ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 7 నుంచి 11 వరకు ఫైనల్‌ జరుగనుండగా.. 12వ తేదీని రిజర్వ్‌డే గ్రా ప్రకటించింది. 2021లో తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ అనంతరం కొత్త షెడ్యూల్‌ విడుదల చేయగా.. ఐసీసీ టెస్టు హోదా కలిగిన సభ్యదేశాల మధ్య ఈ పిరియడ్‌లో 24 సిరీస్‌లు (61 మ్యాచ్‌లు) జరుగనున్నాయి. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (136) టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. 99 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. గురువారం నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండగా.. ఇందులో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరనుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-0 లేదా అంతకంటే మెరుగైన ఫలితంతో భారత్‌ గెలిస్తే.. వరుసగా రెండోసారి తుదిపోరు ఆడే చాన్స్‌ దక్కించుకోనుంది. ఇతర జట్లలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ కూడా ఫైనల్‌ బెర్త్‌ కోసం శ్రమిస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరుగనున్న సిరీస్‌ అనంతరం ఫైనలిస్ట్‌లు ఎవరో తేలనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిఫ ఫైనల్‌ను మొదట లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో నిర్వహించాలని ఐసీసీ భావించినా.. చివరకు ఓవల్‌ను ఖరారు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలి టెస్టు (1880) ఇక్కడే నిర్వహించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న తటస్థ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుండటం మంచి పరిణామమని ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ పేర్కొన్నాడు.


ఆ ఫైనల్‌ గుర్తుందా.. 

2021 జూన్‌ 18 నుంచి 23 వరకు సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన మొదటి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే (49) టాప్‌ స్కోరర్‌ కాగా.. అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44), రోహిత్‌ శర్మ (34) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్‌ పేస్‌ ఆల్‌రౌండర కైల్‌ జెమీసన 5 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ 249 పరుగులకు పరిమితమైంది. కాన్వే (54), విలియమ్సన్‌ (49), లాథమ్‌ (30) రాణించారు. భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్‌ 3 వికెట్లు పడగొట్టారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమవడం.. విజయావకాశాలను దెబ్బతీసింది. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (41) ఒక్కడే కాస్త ప్రతిఘటించగా.. భారత్‌ 170 పరుగులకు ఆలౌటైంది. దీంతో 139 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనను కివీస్‌ సునాయాసంగా పూర్తి చేసి ఐసీసీ టెస్టు గదను సొంతం చేసుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్