IPL 2024 | మయాంక్ యాదవ్ మళ్లీ సంచలనం.. బెంగళూరుపై లక్నో ఘన విజయం

ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో గెలుపొందింది. 182 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.

mayank yadhav, ipl 2024, lsg vs rcb
మయాంక్ యాదవ్ Photo: star sports

ఈవార్తలు, బెంగళూరు: ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో గెలుపొందింది. 182 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. బుల్లెట్‌ వేగంతో బంతులు విసురుతూ ఆకర్షణగా నిలిచిన మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్‌లోనూ నిప్పులు చెరిగాడు. మూడు వికెట్లు (3/14) తీసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లో లోమ్రోర్ 13 బంతుల్లో 33 (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రజత్ పాటీదార్ (29), విరాట్ కోహ్లీ (22), డూప్లెసిస్ (19) పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ (0), కామెరూన్ గ్రీన్ (9), అనుజ్ రావత్ (11), దినేశ్‌ కార్తీక్‌ (4) దారుణంగా విఫలం అయ్యారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 2, సిద్ధార్థ్‌, యశ్‌ ఠాకూర్‌, స్టోయినిస్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 56 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. మార్కస్‌ స్టోయినిస్ (24), కేఎల్ రాహుల్ (20) రన్స్ చేశారు. చివర్లో నికోలస్ పూరన్ (40) ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, రీస్ టాప్లీ, యశ్ దయాల్, సిరాజ్‌ తలో వికెట్ తీశారు.

వెబ్ స్టోరీస్