ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు.. ఫిబ్రవరి 19 నుంచి మ్యాచులు ప్రారంభం

వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (సిటీ) షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి వివాదం చెలరేగుతుంది. పాకిస్తాన్ లో పర్యటించేందుకు భారత జట్టు అంగీకరించడం లేదు. భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలన్న డిమాండ్ ను బీసీసీఐ పెట్టింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (సిటీ) షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది.  ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి వివాదం చెలరేగుతుంది. పాకిస్తాన్ లో పర్యటించేందుకు భారత జట్టు అంగీకరించడం లేదు. భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలన్న డిమాండ్ ను బీసీసీఐ పెట్టింది. అయితే బీసీసీఐ పెట్టిన డిమాండ్ ను పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించకపోవడంతో సమస్య తలెత్తింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ సంప్రదింపులు జరిపి ఎందుకు అంగీకరించేలా చేయడంతో ఎట్టకేలకు ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించిన సమస్య కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలోనే ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది.  ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. ఎనిమిదేళ్ళ తర్వాత జరగబోతున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. 

గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్ బి లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఆరంభ మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్తాన్ జట్టు, కివిస్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇక అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య పోరు ఫిబ్రవరి 23న దుబాయిలో జరగనుంది. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఇష్టపడకపోవడంతో ఈ టోర్నీలో భారత జట్టు ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ లో సాగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత జట్టు ఆడే గ్రూపు మ్యాచ్లను దుబాయ్ లో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్లకు లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలు కానున్నాయి. సెమీ ఫైనల్స్ దుబాయ్, లాహోర్లో జరుగుతాయి. ఒకవేళ భారత్ సెమిస్, ఫైనల్ కు వస్తే ఆ మ్యాచ్లను దుబాయ్ లోనే నిర్వహించనున్నారు. మరోవైపు రెండు సెమి ఫైనల్స్, ఫైనల్స్ కు రిజర్వు డేలు ఉంటాయి. ఈ టోర్నీలో మొత్తంగా 15 మ్యాచులు జరగనున్నాయి. భారత జట్టు మూడు మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది. 23న పాకిస్తాన్ జట్టుతో, మార్చి రెండో తేదీన న్యూజిలాండ్ జట్టుతో దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ కు వెళితే దుబాయ్ లోనే భారత జట్టు ప్రత్యర్థి జట్లతో మ్యాచ్లు ఆడేలా ఐసీసీ ఏర్పాట్లు చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్