Champion Team India : చాంపియన్‌ ట్రోఫీ విజేతగా టీమిండియా.. ప్రముఖులు ఏమంటున్నారంటే

అద్భుత ప్రదర్శనతో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025ను సొంతం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో రోహిత్‌ సేన 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడిరచి ముచ్చటగా మూడోసారి ఈ మినీ ప్రపంచకప్‌ను ముద్దాడింది.

team india

చాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా

అద్భుత ప్రదర్శనతో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025ను సొంతం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో రోహిత్‌ సేన 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడిరచి ముచ్చటగా మూడోసారి ఈ మినీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్‌), డారిల్‌ మిచెల్‌ (101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (2/45), కుల్దీప్‌ యాదవ్‌ (2/40) చెరో రెండు వికెట్లు తీశారు. మహమ్మద్‌ షమీ (1/74), రవీంద్ర జడేజా (1/30) చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. రోహిత్‌ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్‌ రాహుల్‌(33 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌తో 34 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌ (2/46), మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (2/28) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

రోహిత్‌ రెండో బంతే సిక్స్‌

లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు రోహిత్‌ శర్మ, గిల్‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రెండో బంతినే ట్రేడ్‌ మార్క్‌ ఫుల్‌ షాట్‌తో సిక్సర్‌గా మలచిన రోహిత్‌ శర్మ దూకుడుగా ఆడాడు. గిల్‌(31) నిదానంగా ఆడినా.. రోహిత్‌ వేగంగా పరుగులు రాబట్టాడు. పవర్‌ ప్లేలో టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని సాంట్నర్‌.. గ్లేన్‌ ఫిలిప్స్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో విడదీసాడు. గిల్‌ను కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. తొలి వికెట్‌ 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడిరది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ(1)ని మైకేల్‌ బ్రెస్‌వెల్‌.. వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో రోహిత్‌ శర్మ కూడా స్టంపౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

ఆదుకున్న అయ్యర్‌

ఓ భారీ సిక్సర్‌తో ఒత్తిడి తగ్గించిన శ్రేయస్‌ అయ్యర్‌.. చెత్త బంతులను బౌండరీకి తరలించాడు. అయ్యర్‌ను మిచెల్‌ సాంట్నర్‌ పెవిలియన్‌ చేర్చగా, క్రీజులోకి వచ్చిన రాహుల్‌ సాయంతో అక్షర్‌ పటేల్‌ జట్టు స్కోర్‌ను 200 దాటించాడు. అనవసర షాట్‌ ఆడి క్యాచ్‌ ఔట్‌గా అక్షర్‌ పెవిలియన్‌ చేరాడు. హార్దిక్‌ పాండ్యా కూడా అనవసర షాట్‌తో ఔట్‌ అయ్యాడు. చివరగా బ్యాటింగ్‌కు వచ్చిన జడేజాతో కలిసి రాహుల్‌.. సింగిల్స్‌తో విజయం దిశగా జట్టును నడిపించాడు. బౌండరీతో జడేజా టార్గెట్‌ను పూర్తి చేశాడు.

ఎవరేమన్నారంటే..

టోర్నీ మొత్తం బాగా ఆడాం. గత కొన్నేళ్లుగా వైవిధ్యంగా ఆడుతున్నాం. ఆ ఫలితాలనే ఇప్పుడు చూస్తున్నాం. జడేజా 8వ స్థానంలో దిగడం జట్టుకు బాగా కలిసి వచ్చింది.:

- టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

ఆస్ట్రేలియా టూర్‌ తర్వాత పుంజుకోవాలని నిర్ణయించుకున్నాం. జూనియర్‌ ఆటగాళ్లలో అద్భుతమైన ప్రతిభ ఉంది. వారితో మా అనుభవాన్ని పంచుకుంటున్నాం. అదే టీమిండియాను బలంగా చేస్తుంది

- టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ

క్రెడిట్‌ టీమిండియా స్పిన్నర్లదే. అసాధారణ ప్రతిభతో మా ఓటమిని శాసించారు. నలుగురు స్పిన్నర్లు వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లు. బ్యాటింగ్‌ వైఫల్యమే మా ఓటమికి కారణం. ఇంకో 25 పరుగులు చేయాల్సింది.

- న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సాంట్నర్‌

అసాధారణ మ్యాచ్‌.. అపూర్వ విజయం. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉంది. టోర్నమెంటు సాంతం అద్భుతంగా ఆడారు.

- ప్రధాని నరేంద్ర మోదీ

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మూడు సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్‌ నిలిచింది. టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు

- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ గెలవడం ఆనందంగా ఉంది. అద్భుతమైన ఆట తీరుతో మరోసారి సత్తా చాటింది

- తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

బ్రిలియంట్‌ విక్టరీ. గ్రేట్‌ మ్యాచ్‌. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ శర్మకు శుభాకాంక్షలు. సిరీస్‌ ఆసాంతం అద్భుతంగా రాణించిన కోహ్లీకి అభినందనలు. ముఖ్యంగా భారత బౌలర్లు స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టిపడేశారు.

- కేటీఆర్‌

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

గర్వంగా ఉంది. కంగ్రాట్స్‌ టీమిండియా: చిరంజీవి

గర్వంతో ఉప్పొంగిపోయా. చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు : మహేశ్‌బాబు

ట్రోఫీ గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్‌. ఓటమి లేకుండా వరుస విజయాలు సాధించడం చిన్న విషయం కాదు : ఎన్టీఆర్‌

చాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు : అల్లు అర్జున్‌

ఓటమి ఎరుగని చాంపియన్స్‌ : రాజమౌళి 

అద్భుతమైన విక్టరీ. వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్‌ : వెంకటేశ్‌


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్