రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు నిరాశ.. అప్పీల్‌పై కాస్ కీలక నిర్ణయం

Vinesh Phogat | భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్‌పై కాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె చేసుకున్న అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

vinesh phogat

వినేశ్ ఫోగాట్ Photo: Instagram

న్యూఢిల్లీ: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ( కాస్ ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె చేసుకున్న అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో ఫైనల్ ఆడకుండా ఒలింపిక్స్ కమిటీ డిస్‌క్వాలిఫై చేయగా, రజతం ఇవ్వాలని ఆమె ఒలింపిక్స్ కోర్టును ఆశ్రయించింది. అయితే, రెండు సార్లు విచారణను వాయిదా వేసి.. తాజాగా, వినేశ్ అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఫోగట్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకే తీర్పు వెలువడాల్సి ఉన్నా, తీర్పును వాయిదా వేసి.. 16న ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. ఇంతలోనే ఆమె అప్పీల్‌ను తిరస్కరించింది. వాస్తవానికి తీర్పును రెండు సార్లు వాయిదా వేయటంతో.. ఫోగట్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా భావించారు. ఫోగట్ విషయంలో చారిత్రక తీర్పు వస్తుందని న్యాయవాది సింఘానియా అభిప్రాయపడ్డారు. భారతీయులంతా ఫోగట్‌కు రజతం రావాలని ప్రార్థించారు. అయినా, ఫలితం లేకుండా పోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్