టి20 వరల్డ్ కప్ లో పసి కూన జట్లు సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు పై అమెరికా విజయం సాధించిన తరువాత రోజైన శుక్రవారం కెనడా, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కెనడా జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది.
విజయ ఆనందంలో కెనడా జట్టు
టి20 వరల్డ్ కప్ లో పసి కూన జట్లు సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు పై అమెరికా విజయం సాధించిన తరువాత రోజైన శుక్రవారం కెనడా, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కెనడా జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. 12 పరుగులు తేడాతో ఐర్లాండ్ ను ఓడించి విజయం సాధించింది కెనడా జట్టు. ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. టాపార్డర్ పూర్తిగా విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకు కెనడా జట్టు పరిమితమైంది. మిడిల్ ఆర్డర్ లో నికోలాస్ కిర్టన్ (49), శ్రేయాస్ మొవ్వ (37) కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్ కు 75 పరుగులు జోడించడంతో జట్టు ఓ మాదిరి స్కోర్ చేయగలిగింది. మెక్ కార్తీ, యంగ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆఖరిలో అడైర్ (34), డాక్ రెల్ (30 నాట్ అవుట్) పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. కెనడా బౌలర్లు ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో షాట్లు ఆడేందుకు ఐర్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆరో ఓవర్ల నుంచి వరుసగా సాగిన వికెట్ల పతనంతో ఐర్లాండ్ కోలుకోలేకపోయింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (9), బల్నిర్ని (17), టెక్టర్ (7), టక్కర్ (10), కాంఫర్ (4), డేలానీ (3) ఇలా అందరూ చకచగా పెవిలియన్ కు చేరడంతో 59/6 స్కోర్ తో ఐర్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. అయితే, డెత్ ఓవర్లలో డాక్రేల్, ఆడైర్ భారీ షాట్లతో బౌండరీలు రాబట్టి విజయంపై ఆశలు రేపారు. అయితే ఆఖరి ఓవర్ లో 17 పరుగులు చేయాల్సి రావడంతో పేసర్ గార్డన్ నాలుగు పరుగులు ఇచ్చి ఆడేర్ వికెట్ తీయడంతో కెనడా జట్టు విజయాన్ని నమోదు చేసింది.