భారత క్రికెట్‌ అభిమానులకు షాక్‌.. ఆరు నెలల పాటు ఆటకు దూరం కానున్న జస్ప్రీత్‌ బుమ్రా!

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||జస్ప్రీత్‌ బుమ్రా||


ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: భారత క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త! గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరమైన ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. మరో ఆరు నెలల పాటు మైదానంలో దిగడం కష్టమేనని బీసీసీఐ అధికారి తెలిపారు. చికిత్స అనంతరం కోలుకుంటున్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ ఆడుతాడని ముందు అనుకున్నా.. పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. అయితే.. స్వదేశంలోనే సిరీస్‌ జరగుతుండటంతో అతడు లేని ప్రభావం జట్టుపై పెద్దగా పడలేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు రెండు టెస్టులు పూర్తికాగా.. రెండింట్లోనూ స్పిన్నర్లు సత్తాచాటి రోహిత్‌సేన ఘనవిజయాలు కట్టబెట్టారు. దీతో బుమ్రా గురించి పెద్దగా చర్చ సాగలేదు. టెస్టు సిరీస్‌లో ఆడకున్నా.. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో అతడు తప్పక బరిలోకి దిగుతాడని అభిమానులు ఆశించారుఉ. ముంబై ఇండియన్స్‌ ప్రధాన పేసర్‌గా ఉన్న బుమ్రా.. ఈ సీజన్‌కు అందుబాటులో ఉండబోడని ఆయన వెల్లడించారు. గాయం కారణంగా గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన బుమ్రా.. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడలేదు. ఐపీఎల్‌ ప్రారంభానికి మరో నెల రోజుల వ్యవధి ఉన్నా.. బుమ్రా కోలుకునేందుకు దాదాపు ఆరు నెలలు పట్టొచ్చని బీసీసీఐ అధికారి తెలిపారు. ‘మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు బుమ్రా అందుబాటులో ఉండడు. అతడు పునరాగమనం చేసేందుకు మరో ఆరు నెలలు పడుతుంది. అప్పటికి కూడా అతడు తప్పక జట్టులోకి వస్తాడని చెప్పలేం. ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ వరకు అతడు తిరిగి వస్తాడని ఆశిద్దాం. అప్పటికి కూడా పూర్తి స్థాయిలో కోలుకుంటా లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేం’ అని ఆయన అన్నారు. 

 

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా ఇండోర్‌ టెస్టులో విజయం సాధిస్తే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించనుంది. జూన్‌ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా జరుగనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో బుమ్రా కీలకం కానుండగా.. అప్పటి వరకు అతడు పూర్తిగా కోలుకునేలా కనిపించడం లేదు. స్వింగ్‌కు సహకరించే ఇంగ్లండ్‌ పిచ్‌లపై బుమ్రా కీలకమవుతాడని భావించిన భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినౖట్లెంది. కెరీర్‌ ఆరంభంలోనే తన వేగంతో ఆకట్టుకున్న బుమ్రా.. ఆ తర్వాత తరచూ గాయాల బారిన పడుతూ వస్తున్నాడు. జట్టులో అతడి ప్రాధాన్యతను గుర్తించిన మేనేజ్‌మెంట్‌.. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడిస్తున్నది. 2022లో టీమ్‌ఇండియా తరఫున బుమ్రా 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు. బుమ్రా బౌలింగ్‌ శైలితో ప్రమాదమని గతంలో విండీస్‌ పేస్‌ దిగ్గజం మైఖేల్‌ హోల్డింగ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. విభిన్నమైన శైలితో బంతులు వేసే బుమ్రా.. వెన్నెముకపై అదనపు భారం పడటం ఖాయమని.. దీంతో అతడు సుదీర్ఘ కాలం క్రికెట్‌లో కొనసాగలేడని హోల్డింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్