బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ కు అనుకూలించిన సిడ్ని మైదానంలో తొలి ఇన్నింగ్స్ లో ఇరుజట్ల బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 157 పరుగులకు కుప్ప కూలింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ను దూకుడుగానే ఆరంభించింది. ఆ జట్టు ఓపెనర్లు టి20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో మొదటి నాలుగు ఓవర్లలోనే సుమారు 40 పరుగులు వచ్చాయి.
గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ కు అనుకూలించిన సిడ్ని మైదానంలో తొలి ఇన్నింగ్స్ లో ఇరుజట్ల బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 157 పరుగులకు కుప్ప కూలింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ను దూకుడుగానే ఆరంభించింది. ఆ జట్టు ఓపెనర్లు టి20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో మొదటి నాలుగు ఓవర్లలోనే సుమారు 40 పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు లక్ష్యాన్ని చేదించడం సులభం అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్లలో సామ్ కొంటాస్ 22(17), ఉస్మాన్ ఖవాజా 41(45) జట్టుకు శుభారంబాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన లబుసేన్ 6(20), స్టీవెన్ స్మిత్ 4(9) వెంట వెంటనే అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్ 38 బంతుల్లో 34 పరుగులు (నాటౌట్), వెబ్ స్టర్ 34 బంతుల్లో 39 పరుగులు (నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించిపెట్టారు. భారత బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ మూడు, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో గాయం కారణంగా కెప్టెన్ బుమ్రా బరిలోకి దిగలేదు. ఈ సిరీస్ లోనే అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన బుమ్రా లేని లోటు స్పష్టంగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో కనిపించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లోను స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 22 (35), రాహుల్ 13(20), గిల్ 13(15), కోహ్లీ 6(12) ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఆ తరువాత వచ్చిన వికెట్ కీపర్ రషబ్ పంత్ టి20 తరహాలో ధాటిగా ఆడడంతో ఆమాత్రం స్కోరైన భారత జట్టు చేయగలిగింది. 33 బంతులు ఆడిన రషబ్ పంత్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేసి భారత జట్టు కాస్త మెరుగైన స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టుగానే వెను జరగడంతో రెండో ఇన్నింగ్స్ 157 పరుగులకు పరిమితమైంది. ఇంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 185 పరుగులకు ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో కూడా పంత్ 40(98) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మెరుగైన స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు. చివర్లో వచ్చిన కెప్టెన్ బుమ్రా 22(17) బ్యాట్ జులిపించడంతో మెరుగైన స్కోర్ను భారత జట్టు చేసింది. తొలి న్యూస్ లో కూడా ఆస్ట్రేలియా జట్టు చతికల పడింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 181 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు పరిమితం అయింది. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ కొన్స్తాస్ 23(38), వెబ్ స్టర్ 57(105) మాత్రమే రాణించారు. ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కలిపి బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ నాలుగు వికెట్లు, ప్రసిద్ధి కృష్ణ 6 వికెట్లు పడగొట్టాడు. నితీష్ రెడ్డి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు, కెప్టెన్ కమిన్స్ ఐదు, బోలాండ్ 10 వికెట్లు పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా స్కాట్ బోలాండ్ నిలువగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. పదివేలుగా భారత జట్టు వద్దే ఉన్న ఈ ట్రోఫీ ఆస్ట్రేలియా దక్కించుకుంది.