క్రీడాప్రీయులు ఎంత ఆసక్తిగా ఎదురుచూసే ఆస్ట్రేలియా ఓపెన్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలో గ్రాండ్ స్లామ్ టోర్నీకి సమయం వేళయింది. ఆదివారం నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ 2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆల్ టైం గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ 25వ రికార్డ్ గ్రాండ్ స్లామ్ సాధించడం పై దృష్టి సారించాడు. ఈ టైటిల్ లక్ష్యంగా జకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. ఈ గ్రాండ్ స్లామ్ గెలిస్తే జకోవిచ్ టెన్నిస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్లో నెగ్గిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించుకున్నాడు.
సెర్బియన్ దిగ్గజం నోవాక్ జకోవిచ్
క్రీడాప్రీయులు ఎంత ఆసక్తిగా ఎదురుచూసే ఆస్ట్రేలియా ఓపెన్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలో గ్రాండ్ స్లామ్ టోర్నీకి సమయం వేళయింది. ఆదివారం నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ 2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆల్ టైం గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ 25వ రికార్డ్ గ్రాండ్ స్లామ్ సాధించడం పై దృష్టి సారించాడు. ఈ టైటిల్ లక్ష్యంగా జకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. ఈ గ్రాండ్ స్లామ్ గెలిస్తే జకోవిచ్ టెన్నిస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్లో నెగ్గిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించుకున్నాడు. ఇప్పటివరకు మార్గరెట్ కోర్ట్ తో సమానంగా 24 టైటిల్ గెలిచి ఉన్నాడు జకోవిచ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టైటిల్ ను సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాలని లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న 37 ఏళ్ల జకో.. కొత్త కోచ్ ఆంటీ ముర్రేతో ఈ టోర్నీలో బరిలోకి దిగబోతున్నాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఓపెన్ 2025లో నోవాక్ జకో విచ్ కు గట్టి పోటీ ఎదురు కానున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ నెంబర్ వన్ సినర్ (ఇటలీ), ఆల్కరాస్ (స్పెయిన్) టైటిల్ కు బలమైన పోటీదారులుగా ఉన్నారు. 21 ఏళ్ల వయసులోనే సీనర్ నాలుగు గ్రాండ్ స్లామ్ లను సాధించాడు. గతేడాది సీజన్లో తిరిగిలేని ఆదిపత్యాన్ని ప్రదర్శించిన రెడ్డించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు. గడిచిన ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు.
సూపర్ ఫామ్ లో ఉన్న సెనర్ ఈ టోర్నీలో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు. సినర్ ను ఢీ కొట్టి టైటిల్ ను దక్కించుకోవడం జకోవిచ్ కు అంతా సులభం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో 21 ఏళ్ల అల్కరాస్ కూడా ఫేవరెట్ గానే బరిలోకి దిగుతున్నాడు. దూకుడు స్వభావం కలిగిన ఆల్కరాస్ ను ఓడించడం కూడా అంత సులభం కాదని చెబుతున్నారు. గడిచిన ఏడాది కూడా అల్కరాస్ రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచాడు. అతడు కెరీర్ గ్రాండ్ స్లామను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. వీరితోపాటు జ్వరవ్, ఫ్రిట్జ్ (అమెరికా), మెద్వేదేవ్ (రష్యా), రూడ్ (నార్వే) కూడా ఈ టోర్నీలో బలమైన పోటీదారులుగా ఉన్నారు. వీరితో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ రసవత్రంగా సాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అరియానా సభలంక (బెలారస్) ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. 26 ఏళ్ల ఈ టాప్ సీడ్ వరుసగా మూడో ఆస్ట్రేలియన్ ఓపెన్ పై గురి పెట్టింది. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) తో తొలి రౌండులో తలపడనుంది. రెండో సీడ్ ఇగా స్వైటెక్ (పోలాండ్), మూడో సీడ్ కోక గాప్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఈ ముగ్గురు ఆటగాళ్ల ఎలా ఆడతారు అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.