టి20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్-8 లో భాగంగా ఆదివారం ఉదయం కింగ్ స్టన్లోని అర్నోస్ వాలీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో 21 పరుగులు తేడాతో ఆఫ్గనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది.
విజయానందంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు
టి20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్-8 లో భాగంగా ఆదివారం ఉదయం కింగ్ స్టన్లోని అర్నోస్ వాలీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో 21 పరుగులు తేడాతో ఆఫ్గనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. వరల్డ్ కప్ లోనే అత్యధికంగా ఆఫ్గనిస్తాన్ ఒపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్ 118 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బౌలింగ్ కు అనుకూలించిన ఈ పిచ్ పై తొలుత ఆచితూచి ఆడిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు ఆ తరువాత చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోరును పరుగులు పెట్టించారు. అనంతరం ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోరు చేయకుండా ఆపగలిగారు. ఈ మ్యాచ్ లో గుర్బాజ్ 49 బంతుల్లో 60 పరుగులు, ఇబ్రహీం జర్ధాన్ 48 బంతుల్లో 51 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ మూడు, జంపా రెండు వికెట్లు పడగొట్టారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై నామమాత్రపు స్కోరైనప్పటికీ పటిష్టమైన లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి నుంచే ఇబ్బందులు పడింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల దాటిని తట్టుకోలేక ఆస్ట్రేలియా బ్యాటర్లు విలవిల్లాడారు. తొలి ఓవర్ లోనే డేంజరస్ ఓపెనర్ ట్రావెల్స్ హెడ్ ను నవీనుల్ హక్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత ఏ దశలోను ఆస్ట్రేలియా బ్యాటర్లు కోలుకోలేక పోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో గ్లెన్ మాక్స్వెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టును విజయం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన చేశాడు. అయితే గుల్బదిన్ నెయిబ్ బౌలింగ్ లో మ్యాక్స్వెల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా జట్టు ఆశలు అడుగంటి పోయాయి. మాక్స్వెల్ 41 బంతుల్లో మూడు సిక్స్ లు, ఆరు ఫోర్లు సహాయంతో 59 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినవాళ్లు వచ్చినట్లుగానే వెనుదిరిగారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీనుల్ హక్ మూడు, గుల్బదిన్ నెయిబ్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు పతనాన్ని శాసించారు. ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ జట్టు సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియా జట్టు భారత్ పై భారీ పరుగులు తేడాతో విజయం సాధిస్తేనే సెమిస్ లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే సూపర్-8 దశ నుంచే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఆ జట్టుకు ఏర్పడింది.