టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయి. పసికూన జట్లు అగ్ర జట్లుకు షాక్ ఇస్తున్నా. మొన్న పాకిస్థాన్‌పై అమెరికా జట్టు సంచలన విషయం నమోదు చేయగా, నిన్న ఐర్లాండ్‌పై కెనడా జట్టు విజయాన్ని నమోదు చేసింది. తాజాగా టోర్నీ పేవరెట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయాన్ని నమోదు చేసింది.
విజయానందంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు
టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయి. పసికూన జట్లు అగ్ర జట్లుకు షాక్ ఇస్తున్నా. మొన్న పాకిస్థాన్‌పై అమెరికా జట్టు సంచలన విషయం నమోదు చేయగా, నిన్న ఐర్లాండ్‌పై కెనడా జట్టు విజయాన్ని నమోదు చేసింది. తాజాగా టోర్నీ పేవరెట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ ప్రారంభంలోనే సంచలనాలకు వేదికగా మారిన ఈ వరల్డ్ కప్‌లో ఇంకెన్ని ఇలాంటి సంచలనాలు నమోదవుతాయో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇకపోతే, మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 56 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 80 పరుగులు చేయగా, ఇబ్రహీం జద్రాన్ 41 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 103 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి పటిష్టమైన స్థితిలో జట్టు ఉండేలా చేశారు. అయితే, ఆ తరువాతి నుంచి కివిస్ బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీయడంతో ఆప్ఘాన్ జట్టు భారీ స్కోర్ చేయకుండా కళ్లెం వేయగలిగారు. ఆఖరి ఓవర్‌లో కెప్టెన్ రషీద్ ఖాన్(6) రనౌట్ కాగా, హాప్ సెంచరీ చేసిన గుర్బాజ్, గుల్బదిన్‌ను(0)ను అవుట్ చేసిన బౌల్ట్ జట్టు స్కోర్ 160 దాటకుండా అడ్డుకున్నాడు. కివిస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివిస్ జట్టు ఆప్ఘాన్ బౌలర్లు ధాటికి కకావికలమయ్యారు. 15.2 ఓవర్లలో 75 పరుగులకు ఆ జట్టు కుప్పకూలిపోయి భారీ ఓటమిని చవి చూసింది. ఫిలిప్ (18), హెన్రీ (12) మాత్రమే రెండు అంకెల స్కోర్ స్కోర్ చేశారు. గుర్బాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫరూకీ, రషీద్ నాలుగేసి వికెట్లు తీశారు.