చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. రెండో ఆటగాడిగా రికార్డ్‌

ఆప్ఘనిస్థాన్‌ క్రికెట్‌, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డ్‌ సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌ ఎక్కడ జరిగినా అందులో రషీద్‌ ఖాన్‌ ఆడుతుంటాడు. తాజాగా వంద బాల్స్‌ లీగ్‌ జరుగుతోంది. ఈ లీగ్‌లో మాంచెస్టర్‌ ట్రెంట్‌ రాకెట్స్‌ టీమ్స్‌ తరఫున ఆడుతున్న రషీద్‌.. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌ పాల్‌ వాల్టర్‌ వికెట్‌ తీయడం ద్వారా ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

Rashid Khan

స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌

ఆప్ఘనిస్థాన్‌ క్రికెట్‌, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డ్‌ సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌ ఎక్కడ జరిగినా అందులో రషీద్‌ ఖాన్‌ ఆడుతుంటాడు. తాజాగా వంద బాల్స్‌ లీగ్‌ జరుగుతోంది. ఈ లీగ్‌లో మాంచెస్టర్‌ ట్రెంట్‌ రాకెట్స్‌ టీమ్స్‌ తరఫున ఆడుతున్న రషీద్‌.. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌ పాల్‌ వాల్టర్‌ వికెట్‌ తీయడం ద్వారా ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ వికెట్‌తో  టీ20ల్లో ఇప్పటి వరకు 600 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రషీద్‌ కంటే ముందు వెస్టిండీస్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో ఉన్నాడు. 578 మ్యాచుల్లో 630 వికెట్లు తీసి డ్వేన్‌ బ్రావో మొదటి స్థానంలో ఉండగా, రషీద్‌ ఖాన్‌ కేవలం 441 మ్యాచుల్లో 600 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ ఫీట్‌ సాధించిన రెండో బౌలర్‌గా నిలిచిన రికార్డు సృష్టించాడు. అతి చిన్న జట్టు అయిన అప్ఘనిస్థాన్‌ నుంచి వచ్చిన రషీద్‌ అతి తక్కువ కాలంలో ఈ ఫీట్‌ను అందుకోవడం గమనార్హం. రషీద్‌ తరువాత సునీల్‌ నరైన 571 వికెట్లుతో మూడో స్థానంలో ఉండగా, ఇమ్రాన్‌ తాహీర్‌ 502 వికెట్లతో నాలుగో స్థానంలో, షకీబ్‌ అల్‌ హసన్‌ 492 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. భారత్‌ నుంచి ఈ అత్యధిక వికెట్లు జాబితాలో యజ్వేంద్ర చాహల్‌ మాత్రమే ఉన్నాడు. 305 మ్యాచ్‌ల్లో 354 వికెట్లు పడగొట్టాడు. 

ఇప్పటి వరకు రషీద్‌ ఖాన్‌ ఐదు టెస్టు మ్యాచులు ఆడగా, 103 వన్డే, 93 టీ20 మ్యాచులు, 121 ఐపీఎల్‌ మ్యాచులు అడాడు. టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టగా, వన్డేల్లో 183 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు, ఐపీఎల్‌లో 149 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచంలో ఎక్కడ లీగ్‌ జరిగినా తప్పనిసరిగా రషీద్‌ ఖాన్‌ ఆడుతుంటాడు. ఐపీఎల్‌తోపాటు బిగ్‌బాస్‌, ఐపీఎల్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా లీగ్‌ల్లో కూడా ఆడుతున్న రషీద్‌ ఖాన్‌ వికెట్లు పడగొడుతూ సత్తా చాటుతున్నాడు. ఆప్ఘనిస్థాన్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రషీద్‌ ఖాన్‌ బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తూ తానే ఆడే జట్టుకు అద్భుత విజయాలను అందిస్తుంటాడు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్