చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం ఆఫ్గాన్ జట్టు

తమ వన్డే క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. అత్యంత బలమైన దక్షిణాఫ్రికా జట్టుపై తొలిసారిగా ఆఫ్గనిస్తాన్ జట్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసి అరుదైన ఘనతను నమోదు చేసింది. పటిష్టమైన జట్టుపై సిరీస్ విజయాన్ని నమోదు చేసిన తొలి చిన్న జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యచ్ లో వన్డే సిరీస్ ఆడేందుకు సౌత్ ఆఫ్రికా జట్టు యూఏఈ పర్యటనకు వెళ్ళింది. తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది.

Afghanistan team incelebrations

విజయానందంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు

తమ వన్డే క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. అత్యంత బలమైన దక్షిణాఫ్రికా జట్టుపై తొలిసారిగా ఆఫ్గనిస్తాన్ జట్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసి అరుదైన ఘనతను నమోదు చేసింది. పటిష్టమైన జట్టుపై సిరీస్ విజయాన్ని నమోదు చేసిన తొలి చిన్న జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యచ్ లో వన్డే సిరీస్ ఆడేందుకు సౌత్ ఆఫ్రికా జట్టు యూఏఈ పర్యటనకు వెళ్ళింది. తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన రెండో వన్డేలో మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో వరుసుగా రెండు వన్డేల్లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సిరీస్ కైవసం చేసుకున్నట్లయింది. శుక్రవారం షార్జా వేదికగా జరిగిన  జరిగిన రెండో మ్యాచ్ లో  హస్మతుల్లా బృందం 177 పరుగులు తేడాతో విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ను కాకా వికలం చేశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన రషీద్ ఖాన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో దారుణ పరాభవాన్ని ఆ జట్టు మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

అదరగొట్టిన గుర్బాజ్, అజ్మతుల్లా..

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రం నష్టపోయిన ఆఫ్గనిస్తాన్ జట్టు 311 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి చెంచరీతో మెరిచాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్స్ లు  సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హషన్ 29 పరుగులతో పరవాలేదనిపించగా, వన్ డౌన్ బ్యాటర్ రహమత్ 50 పరుగులతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో నెంబర్ బ్యాటర్ గా వచ్చిన అజ్మతుల్లా విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడాడు. 50 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్స్ లు సహాయంతో 86 పరుగులను చేసి నాటౌట్ గా నిలవడంతోపాటు జట్టుకు భారీ స్కోరును అందించి పెట్టాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఏ స్థితిలోనూ లక్ష్యం దిశగా ముందుకు సాగలేదు. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ తంబా బవుమా 47 బంతుల్లో 38 పరుగులు చేయగా, మరో ఓపెనర్ టోనీ డి జార్జి 44 బంతుల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. రీజా హెన్రిక్స్ 34 బంతుల్లో 17 పరుగులు, ఎయిడెన్ మార్క్రమ్ 30 వంతుల్లో 20 పరుగులు మాత్రమే సాధించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. దీంతో 134 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టు 34.2 ఓవర్లకు ఆల్ అవుట్ అవ్వడంతో 177 పరుగుల భారీ ఆధిక్యంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండో వన్డేలో విజయాన్ని దక్కించుకుంది. తొలి వన్డేలోనూ ఆఫ్గనిస్తాన్ జట్టే విజయం సాధించింది. ఈ వన్డేలో 6 వికెట్లు తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయాన్ని నమోదు చేయడంతో వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డే ఆదివారం జరగనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్