హైదరాబాద్ రప్పా.. రప్పా.. సెంచరీతో కదం తొక్కిన అభిషేక్ శర్మ.. SRH విన్

ఒక బాల్ ఫోర్.. ఇంకో బాల్ సిక్స్.. ఇంకో బాల్ ఫోర్.. ఇంకో బాల్ సిక్స్.. ఏ బాల్ వస్తే ఆ బాల్‌ను స్టాండ్‌లోకి పంపడమే. ఇది కదా కోరుకున్నది. ఇది కదా హైదరాబాద్ బ్యాటర్ల నుంచి ఆశించింది.

abhishek sharma
హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ

హైదరాబాద్, ఈవార్తలు : ఒక బాల్ ఫోర్.. ఇంకో బాల్ సిక్స్.. ఇంకో బాల్ ఫోర్.. ఇంకో బాల్ సిక్స్.. ఏ బాల్ వస్తే ఆ బాల్‌ను స్టాండ్‌లోకి పంపడమే. ఇది కదా కోరుకున్నది. ఇది కదా హైదరాబాద్ బ్యాటర్ల నుంచి ఆశించింది. ఇది కదా.. యావత్తు సన్ రైజర్స్ హైదరాబాద్‌ అభిమానులు కోరుకున్నది. అన్నట్లుగానే అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. మరోవైపు.. ట్రావిస్ హెడ్ (66 పరుగులు) కూడా దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు చిన్నబోయింది. కొండంత లక్ష్యం చిన్న ఎలుకలా మారిపోయింది. ఫలితంగా హైదరాబాద్.. ఓటమి నుంచి తేరుకొని గెలుపును ముద్దాడింది. పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 246 టార్గెట్‌ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. పంజాబ్‌ బౌలర్లలో చాహల్‌, అర్షదీప్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్రియాంశ్ ఆర్య (36; 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (42) కూడా మెరిశాడు. చివర్లో మార్కోస్ స్టాయినిస్ (34) చివర్లో వరుసగా 4 సిక్సులు బాదాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, ఎషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్