అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టుకు షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి విజేతగా నిలిచింది. ఈ విజయంతో తొలిసారి బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ విజేతగా అవతరించింది. ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 59 పరుగులతో తేడా విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది.
ఆనందంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు
అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టుకు షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి విజేతగా నిలిచింది. ఈ విజయంతో తొలిసారి బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ విజేతగా అవతరించింది. ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 59 పరుగులతో తేడా విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. వరుసగా తొమ్మిదో ట్రోఫీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ జట్టు ఆశలపై బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో మహ్మద్ రిజాన్ అత్యధికంగా 47 పరుగులు చేయగా, మహ్మద్ శిబాబ్ 40 పరుగులు, మహ్మద్ ఫరీద్ 39, జవాద్ అబ్రార్ 20, అజీజుల్ హకీమ్ తమీమ్ 16 పరుగులు చేసి రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు 198 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హార్ధిక్ రాజ్, చేతన్ శర్మ, యధాజిత్ గుహా చెరో రెండో వికెట్లు పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు బొక్క బోర్ల పడింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ పరుగులు చేయడానికి భారత ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్ష్య చేధనలో విఫలమైన అమన్ నేతృత్వంలోని భారత జట్టు 35.2 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలింది. భారత జట్టులోని ఆటగాళ్లు అంతా దారుణ ఆటతీరుతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. భారత జట్టులోని కెప్టెన్ అమన్ అత్యధిక పరుగులు చేశాడు. 65 బంతుల్లో ఒక ఫోర్ 26 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మిగిలిన ఆటగాళ్లు నామమాత్రపు స్కోర్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. భారత జట్టు ఓపెనర్లు ఆయుష్‌మత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) వెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీని తరువాత భారత జట్టు వికెట్ల పతనం క్రమంగా కొనసాగింది. 73 పరుగులు వద్ద భారత జట్టులో సగంం బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. లోయర్ ఆర్డర్‌లో హార్ధిక్ రాజ్ (24) రాణించిన అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఐదుగురు భారత ఆటగాళ్లు రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్‌లో కెప్టెన్ మహ్మద్ అజీజుల్ హకీమ్ తమీమ్, మహ్మద్ ఇక్బాల్ హాసన్ ఎమోన్ చెరో మూడు వికెట్లు తీసి భారత జట్టు పతనాన్ని శాసించారు. తాజా నిర్వహించినది 11వ ఆసియా కప్ పోటీలు. ఇప్పటి వరకు భారత జట్టు ఎనిమిదిసార్లు ట్రోఫీని గెల్చుకుంది. తొమ్మిదో ట్రోఫిని సాధించడమే లక్ష్యంగా బరిలోకి ఫైనల్‌లో బోల్తా పడింది. సెమీఫైనల్‌లో శ్రీలంక జట్టుపై గెలిచి ఫైనల్‌లోకి చేరుకుంది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై ఓటమి పాలైంది.