జింబాబ్వేతో తొలి టీ20లో భారత్‌కు షాక్‌.. విజయం సాధించిన జింబాబ్వే జట్టు

టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన తరువాత ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే భారత జట్టుకు షాక్‌ తగిలింది. జింబాబ్వేతో శనివారం జరిగిన మ్యాచ్‌లో యువ భారత జట్టు దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. ఐదు టీ20 మ్యాచ్‌లు సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వే వెళ్లిన యువ భారత్‌ జట్టు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలై సిరీస్‌లో వెనుకబడింది.

Zimbabwe players

విజయానందంలో జింబాబ్వే ఆటగాళ్లు



టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన తరువాత ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే భారత జట్టుకు షాక్‌ తగిలింది. జింబాబ్వేతో శనివారం జరిగిన మ్యాచ్‌లో యువ భారత జట్టు దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. ఐదు టీ20 మ్యాచ్‌లు సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వే వెళ్లిన యువ భారత్‌ జట్టు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలై సిరీస్‌లో వెనుకబడింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే జట్టు భారత బౌలర్లు ధాటికి తొమ్మిది వికెట్లు నష్టపోయి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే జట్టులో వెస్లీ మద్విర (21), బ్రియాన్‌ బెన్నేట్‌ (22), సికిందర్‌ రజా (17), డియోన్‌ మైయర్స్‌ (23), క్లైవ్‌ మదాండే(29) పరుగులు చేయడంతో నామమాత్రపు స్కోరును ఆ జట్టు చేయగలిగింది. భారత జట్టు బౌలర్లలో రవి బిష్ణోయ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్‌ సుందర్‌ రెండు, ఆవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 116 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ జట్టు ఏ దశలోనూ విజయం దిశగా పయనం సాగించలేకపోయింది. వరుస విరామాల్లో జింబాబ్వే బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే బ్రియాన్‌ బెన్నెట్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ(0) పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ జట్టును విజయం వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. 

ముజరబాని బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌(2), రింకూ సింగ్‌(0), ద్రువ్‌ జురేల్‌(7) వెంట వెంటనే ఔట్‌ కావడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. పది ఓవర్ల వరకు క్రీజులో నిలదొక్కుకున్న గిల్‌ను సికిందర్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. చివర్లో వచ్చిన రవి బిష్ణోయ్‌ (9), ఆవేశ్‌ ఖాన్‌(16) వేగంగా ఆడి వాషింగ్టన్‌ సుందర్‌(27) సుందర్‌తో కలిసి కొంత వరకు పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 19.5 ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలగడంతో 13 పరుగులతో తేడా భారత్‌ జట్టు ఓటమి పాలైంది. జింబాబ్వే జట్టు బౌలర్లలో చటార, సికిందర్‌ రజా మూడేసి వికెట్లు తీసి భారత్‌ జట్టును చావు దెబ్బకొట్టారు. ఆదివారం రెండో టీ20 జరగనుంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్