తడబడిన భారత్.. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్లో ఓటమి, సెమీస్ ఆశలు సంక్లిష్టం

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా మహిళలు జట్టు ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో భారత మహిళల జట్టు సెమీస్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. గతంలో టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్, 2020 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓటమిపాలైన భారత జట్టు మరోసారి అదే రీతిలో తాజా వరల్డ్ కప్ లోను ఓటమిపాలైంది. ఆదివారం రాత్రి వరకు జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణయిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది.

Both teams are players

ఇరు జట్లు ఆటగాళ్లు

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా మహిళలు జట్టు ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో భారత మహిళల జట్టు సెమీస్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. గతంలో టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్, 2020 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓటమిపాలైన భారత జట్టు మరోసారి అదే రీతిలో తాజా వరల్డ్ కప్ లోను ఓటమిపాలైంది. ఆదివారం రాత్రి వరకు జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణయిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హ్యారిస్ (40), పెర్రీ (32), మెక్ గ్రాత్ (32) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 151 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక, దీప్తి రెండేసి వికెట్లు తీశారు. భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో భారత జట్టు తడబాటుకు గురైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో భారత్ జట్టు ఓటమి పాలైంది.

దీంతో భారత మహిళల జట్టు 9 పరుగులు తేడాతో ఓటమిని చవిచూసింది. కెప్టెన్ హార్మోన్ ప్రీత్ (54 నాటౌట్) అర్థ సెంచరీ తో పోరాటాన్ని చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. కెప్టెన్ కు దీప్తి శర్మ (29), సఫాలీ వర్మ (20) సహకారాన్ని అందించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మోలినెక్స్, సదర్ల్యాండ్ నిలిచారు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిదవ సారి t20 ప్రపంచ కప్ సెమిస్ కు చేరినట్టు అయింది.  తాజా ఓటమితో భారత జట్టు సెమీస్ ఆశలు సంక్లిష్టమైనట్లు చెబుతున్నారు. నాకౌట్ దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలు కావడంతో ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రయాణం దాదాపుగా ముగిసినట్టుగానే చెబుతున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు వికెట్లు పడుతున్నప్పటికీ వేగంగానే ఆడింది. సఫాలీ వర్మ దూకుడుతో చేదనను భారత్ ధాటిగానే ప్రారంభించింది. నాలుగో ఓవర్ లో సఫాలీ వర్మ అవుట్ కాగా, స్మృతి మందాన, జెమిమాను పెవిలియన్ చేర్చి ఆసీస్ జట్టు భారత్ ను గట్టి దెబ్బ కొట్టింది. ఈ దశలో హర్మన్ ప్రీత్, దీప్తి నాలుగో వికెట్ కు రూ.63 పరుగులు జోడించినా రన్ రేట్ పెరిగిపోయింది. దీప్తి తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినవాళ్లు వచ్చినట్లు పెవిలియన్ కు చేరారు. ఆఖరి ఓవర్ లో నలుగురు భారత బ్యాటర్లు నిష్క్రమించడం గమనార్హం. హర్మన్ ప్రీత్ జట్టును గెలిపించేందుకు షాయశక్తుల ప్రయత్నించిన ఆమెకు సహకరించే ఆటగాళ్లు లేకపోవడంతో ఫలితం రాక పోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్