Online Roasting | హద్దు దాటుతున్న ఆన్‌లైన్ రోస్టింగ్.. నెట్టింట్లో ఏమిటీ చెత్త..?

నెట్టింట్లో బోలెడంత చెత్త.. అందులో ఒక చెత్తగా ఆన్‌లైన్ రోస్టింగ్ Online Roasting మారిపోయింది. అసలు రోస్టింగ్ అంటే ఏమిటి? నాలుగైదుగురు కలిసి కుళ్లు జోకులు వేసుకోవడానికి రోస్టింగ్ అని పేరు పెట్టి టైంపాస్ చేయడం. సరదాగా ముచ్చట్లు చెప్పుకొనే వేదిక.

online roasting
ప్రతీకాత్మక చిత్రం

నెట్టింట్లో బోలెడంత చెత్త.. అందులో ఒక చెత్తగా ఆన్‌లైన్ రోస్టింగ్ Online Roasting మారిపోయింది. అసలు రోస్టింగ్ అంటే ఏమిటి? నాలుగైదుగురు కలిసి కుళ్లు జోకులు వేసుకోవడానికి రోస్టింగ్ అని పేరు పెట్టి టైంపాస్ చేయడం. సరదాగా ముచ్చట్లు చెప్పుకొనే వేదిక. ఇది ఇంటర్నెట్ వేదికలపై, సోషల్ మీడియాల్లో జరుగుతుందని కాబట్టి దీన్ని.. ఆన్‌లైన్ రోస్టింగ్ అని పిలుస్తారు. ఆన్‌లైన్ రోస్టింగ్‌లో ఏం చేస్తారంటే.. ఒక ఫొటోను పెట్టి.. కొంతమంది ఆన్‌లైన్‌లో ఫొటో గురించి కుళ్లు జోకులు వేయడం అన్నమాట. ఈ తతంగాన్నంతా ఆన్‌లైన్ వీక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారన్న మాట.

అసభ్యానికి కేరాఫ్‌గా ఆన్‌లైన్ రోస్టింగ్ వేదికలు

కుళ్లు జోకులు వేయడం వరకు ఓకే. కానీ, ఈ ఆన్‌లైన్ రోస్టింగ్ వేదికలు అసభ్యానికి కేరాఫ్‌గా మారుతున్నాయి. కుళ్లు జోకులు కాస్తా అసభ్య పదజాలం ఇమిడి తప్పుడుగా తయారవుతున్నాయి. తాజాగా, తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఒక ఉదంతంతో ఆన్‌లైన్ రోస్టింగ్ విధానంపై తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ చిన్నారిని దండించే తండ్రి.. బెల్ట్ తీస్తున్న ఫొటోపై అసభ్యంగా మాట్లాడటంతో ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది.

అసలేం జరిగిందంటే..

ఇటీవల ఓ చిన్నారిని తండ్రి బెల్ట్‌తో బెదిరించే వీడియోలో.. చిన్నారి ముందు తండ్రి బెల్ట్ తీస్తున్న స్క్రీన్ షాట్‌ను రోస్టింగ్ ముందు పెట్టి.. అసభ్యకరంగా మాట్లాడారు. తండ్రీ కూతుళ్ల బంధంపై నీచంగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని చూసిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అలాంటి వ్యక్తులు, వేదికలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ, సీఎంవో, షీటీమ్స్‌ను ట్యాగ్‌ చేశాడు. మంచు మనోజ్ కూడా స్పందించాడు. ఆ నలుగురు నిందితుల పేర్లు.. ప్రణీత్ హన్మంతు, ఆది నారాయణ, డల్లాస్ నాగేశ్వరరావు, బుర్ర యువరాజ్. వీరిలో ప్రణీత్ హన్మంతు తండ్రి ఐఏఎస్. ఆయన పేరు హన్మంతు అరుణ్ కుమార్. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు, విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్