కరోనా తర్వాత ఆరోగ్యంపై అవగాహన ఎంతలా పెరిగిందో.. ప్రస్తుతం హిందువుల్లో అలాంటి హిందూ భావనే పెరుగుతోంది. లౌకిక వాదులు సైతం కొన్ని సందర్భాల్లో హిందూ భావాన్ని వ్యక్తీకరిస్తూ తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు సోషల్ ట్రెండింగ్ : కరోనా తర్వాత ఆరోగ్యంపై అవగాహన ఎంతలా పెరిగిందో.. ప్రస్తుతం హిందువుల్లో అలాంటి హిందూ భావనే పెరుగుతోంది. లౌకిక వాదులు సైతం కొన్ని సందర్భాల్లో హిందూ భావాన్ని వ్యక్తీకరిస్తూ తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో జరిగిన భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లో విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు హిందువులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. ఏపీలో తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్త చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. పైగా, గతంలో ఏ నాయకుడూ వినిపించనంత ధాటిగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సనతన ధర్మం, సనాతన బోర్డు ఆవశ్యకతను లేవనెత్తుతున్నారు.
అదే సమయంలో.. దేశవ్యాప్తంగా సనాతన బోర్డుపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. సనాతన ధర్మాన్ని ఎందుకు పాటించకూడదు? సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం ఎందుకు చేయకూడదు? యోగాను ప్రపంచానికి నేర్పినట్టే.. గాడి తప్పుతున్న ప్రపంచాన్ని ఆధ్యా్త్మికంవైపు నడిపించేందుకు సరైన మార్గం సనాతన ధర్మ బోధనేనని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. అనేక సందర్భాలు సనాతన ధర్మాన్ని పాటించే దిశగా ప్రజలను తీసుకెళ్తోంది. హిందువుల్లో పెరుగుతున్న హిందూత్వ భావన.. ఒకటి ఉనికిని కాపాడుకోవడానికి కాగా, ఇంకోటి.. ఉనికిని చాటాల్సిన సందర్భంగా అభివర్ణించవచ్చు.
ఇక.. ప్రస్తుతం సనాతన ధర్మంపై ఏ స్థాయిలో చర్చ జరుగుతోందంటే.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో #towardssanatandharma హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఏ గ్రామం చూసినా, ఏ పట్టణం చూసినా, దేశం.. విదేశం.. ఇలా అంతటా సనాతన ధర్మంపైనే చర్చ జరుగుతోందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. సనాతన సంస్కృతిని ప్రతి ఒక్కరికి నేర్పించాల్సిన తరుణం ఇదేనని వాదిస్తున్నారు. మన సంస్కృతిని మనం కొని తెచ్చుకొన్నది కాదని.. ఇక్కడి ప్రకృతి, ఇక్కడి మానవత్వం, ఇక్కడి ఆత్మే మనకు అన్నీ నేర్పిందని ఓ పెద్దాయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.