తెలుగు సినీ పరిశ్రమకు చాన్స్ దొరికిందా.. అంతా కలిసి రేవంత్‌ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారా..

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఇబ్బందులకు తెలుగు సినీ పరిశ్రమ బదులు తీర్చుకుంటోందా? ఇదే చాన్స్ అంటూ సినీ నటులు ప్రభుత్వంపై తమ కోపాన్ని వెల్లగక్కుతున్నారా? అంటే తాజా స్పందనలు అవుననే అంటున్నాయి.

tollywood hcu revanth reddy

తెలుగు సినీ పరిశ్రమకు చాన్స్ దొరికిందా.. అంతా కలిసి రేవంత్‌ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారా..

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఇబ్బందులకు తెలుగు సినీ పరిశ్రమ బదులు తీర్చుకుంటోందా? ఇదే చాన్స్ అంటూ సినీ నటులు ప్రభుత్వంపై తమ కోపాన్ని వెల్లగక్కుతున్నారా? అంటే తాజా స్పందనలు అవుననే అంటున్నాయి. వాస్తవానికి హెచ్‌సీయూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వాస్తవమే. తెలంగాణ ప్రభుత్వ చర్యలను అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడాలంటూ కోరుతున్నాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల చర్యలపై సినీ నటులు ఆచితూచి స్పందిస్తుంటారు. ప్రభుత్వాన్ని ఏమైనా అంటే ఇబ్బందులు తప్పవు అని భయపడుతుంటారు. కానీ.. హెచ్‌సీయూ భూముల వివాదంలో వారంతట వారే ఒక అడుగు ముందుకు వేశారు. ప్రభుత్వానికి తలొగ్గి హెచ్‌సీయూ వ్యవహారాన్ని కప్పి పెట్టాలని ప్రధాన మీడియా చూస్తే.. సోషల్ మీడియా మాత్రం బట్టబయలు చేస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మీడియా బాధితుల పక్షాన ఉంటుంది. కానీ, తెలుగు ప్రధాన మీడియా మాత్రం రేవంత్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నట్లుగా ఉంది. అందుకే హెచ్‌సీయూ వ్యవహారంపై స్పందించడం లేదు.

ఇదే సమయంలో.. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తమ గొంతుకను వినిపిస్తున్నారు. భిన్న రంగాల ప్రముఖులు ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ భార్య ఉపాసన గురించే. ఈమె అందరికంటే ముందుగా తన వాణి వినిపించారు. తర్వాత రేణూదేశాయ్ కూడా హెచ్‌సీయూ భూములను కాపాడాలని వీడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత.. ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు స్పందించడం మొదలు పెట్టారు. దర్శకుడు, కమెడియన్ వేణు, ప్రకాశ్ రాజ్, సమంత, దియా మీర్జా, ఈషా రెబ్బా, బిందు మాధవి, మణి శర్మ, అనసూయ భరద్వాజ్ తదితరులు హెచ్‌సీయూ భూములను కాపాడాలని పేర్కొంటున్నారు. తాజాగా.. యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఈ కోవలో చేరారు.

‘నేను రాజకీయాల కోసం ఈ వీడియో చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిపై వ్యతిరేకంగా కూడా ఈ వీడియో నేను చేయటం లేదు, ఎక్కడ నేను వ్యతిరేకం కూడా కాదు. Hcu జరుగుతున్న ఘటన అందరికీ తెలుసు. నేనున్న ఈ అపార్ట్మెంట్లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగింపబడ్డాయో నాకు కూడా తెలుసు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే పక్షులు నెమళ్ళు చాలా సఫర్ అవుతున్నాయి. రాబోయేది అత్యంత వేసవికాలం అందులో పక్షులు నెమళ్లు జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. జంతువులను రీహబిలైట్ చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పాజిటివ్ స్టెప్స్ తో మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేసింది.

ఈ పోస్టుల మాట ఎలా ఉన్నా.. పని కట్టుకొని సినీ పరిశ్రమ ఇంతలా స్పందించడం వెనుక ఏదో మతలబు ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కచ్చితంగా సీఎం రేవంత్ లక్ష్యంగానే ఈ వీడియోలు, పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. అల్లు అర్జున్‌ను జైలుకు పంపడం.. సినీ నటులపై మంత్రులు పలుమార్లు కామెంట్లు చేయడం.. తదితర సంఘటనలు యావత్తు సినీ పరిశ్రమను అన్నట్లుగా భావించడం వల్లే.. హెచ్‌సీయూ విషయంలో బాహాటంగా స్పందిస్తున్నారని వివరిస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్