కేసీఆర్ మీద కోపంతో తెలంగాణకు మేధావుల మోసం

తెలంగాణ అధికారిక చిహ్నంలో, ఆర్టీసీ బస్సు చక్రంలో కాకతీయ కళాతోరణం తీసేసే కుట్ర జరుగుతుంటే మౌనం ఎందుకు? ఆ కళాతోరణం కేసీఆర్ తయారు చేసింది కాదు కదా. తెలంగాణకు అస్థిత్వం అది. ఆనాడు కాకతీయ కళాతోరణంలో మార్పులు చేసిండని కేసీఆర్‌పై ఎత్తిన గొంతే.. ఇప్పుడు ఎందుకు మూగబోయింది? కాళేశ్వరాన్ని కేసీఆరే కట్టించినా.. ఉపయోగపడ్డది రాష్ట్రం మొత్తానికి కదా.

telangana intellectuals
తెలంగాణకు మేధావుల మోసం

చిహ్నంలో కాకతీయ కళాతోరణం తీసేస్తామంటే చప్పుడు లేదు..

కాళేశ్వరాన్ని పక్కనపెడతామంటే పోనీ మాకెందుకనుకున్నరు..

అమరజ్యోతివైపు కన్నెత్తి చూడబోనంటే చూడకపోనీ అనుకున్నరు..

తెలంగాణ పాటను ఆంధ్రా వ్యక్తితో పాడిస్తామంటే కిక్కురుమనరు..

కేసీఆర్ మీద కోపంతోనే గదా ఇదంతా.. గైనెను ఇంట్ల కూర్చోబెట్టిర్రు గదా..

మళ్లా ఇంకేం కోపం.. అస్థిత్వం ఆగమైతుంటే రక్తం మరుగుతలేదా?

తెలంగాణ కోసం జనాన్ని పోగేసినోళ్లు మీరు..

తెలంగాణ కోసం విద్యార్థుల్లో చైతన్యం నింపినోళ్లు మీరు.. 

తెలంగాణ కోసం మెదడును కరగదీసినోళ్లు మీరు..

తెలంగాణ కోసం నిద్రాహారాలు మానేసినోళ్లు మీరు..

మరి గిప్పుడేమైందిరా బై.. ఉద్యమ చైతన్యం ఏడపాయె?

కాళోజీకి గిట్ట తెలిసి ఉంటే మిమ్ములను చీల్చి చెండాడేటోడు.. జయశంకర్ సారు బతికుంటే మిమ్ములను ఉరికిచ్చి కొట్టేటోడు.. కొండా లక్ష్మణ్ బాపూజీకి కనిపిస్తే ట్యాంక్‌బండ్‌లో ముంచేటోడు.. శ్రీకాంతాచారికి తెలిసి ఉంటే మీ శరీరాలకు అగ్గి పెట్టేటోడు.. మన అస్థిత్వాన్ని దెబ్బతీస్తుంటే చప్పుడు చేస్తలేరని అంగీలాగు తీసేసి బరివాతల కూర్చోబెట్టేటోళ్లు. ఒక ఆంధ్రా వ్యక్తి చేతిలో తెలంగాణ అస్థిత్వాన్ని పెడితే మాట్లాడరేం అని నాలుకకు సురుకు అంటించేటోళ్లు. తెలంగాణ మొత్తం జయజయ ధ్వానాలతో అందెశ్రీని అందలమెక్కిస్తే.. ఆయనేమో కీరవాణిని మించినోడు తెలంగాణల ఉన్నడా? అని అనుడు ఎంత వరకు కరెక్ట్? దీనిపైనా ఏ ఒక్క మేధావీ మాట్లాడరేం. నిజమే.. కేసీఆర్ మీద మేధావులకు కోపం ఉన్నది. ఆ కోపంతోనే ఆయన్ను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అక్కడికే అయిపాయె. తెలంగాణ అధికారిక చిహ్నంలో, ఆర్టీసీ బస్సు చక్రంలో కాకతీయ కళాతోరణం తీసేసే కుట్ర జరుగుతుంటే మౌనం ఎందుకు? ఆ కళాతోరణం కేసీఆర్ తయారు చేసింది కాదు కదా. తెలంగాణకు అస్థిత్వం అది. ఆనాడు కాకతీయ కళాతోరణంలో మార్పులు చేసిండని కేసీఆర్‌పై ఎత్తిన గొంతే.. ఇప్పుడు ఎందుకు మూగబోయింది? కాళేశ్వరాన్ని కేసీఆరే కట్టించినా.. ఉపయోగపడ్డది రాష్ట్రం మొత్తానికి కదా. మరి మీ పిడికిళ్లకు సంకెళ్లు ఎందుకు పడ్డయ్? అమరులజ్యోతి జాగా మన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిందే కదా. ఆ జ్యోతిని కండ్లతో ఎందుకు చూడలేకపోతున్నరు? జయ జయహే తెలంగాణ అని పాడుకున్నది తెలంగాణ. అది తెలంగాణ ఆస్తి. అది తెలంగాణ ప్రాణం. కేసీఆర్ పక్కన పెడితే తెలంగాణ పాట ఎక్కడ? అడిగిన మీరే.. పోయి పోయి ఆంధ్రా వ్యక్తి చేతిలో పెడితే మీ స్వరపేటికకు ఏం అడ్డం పడ్డది? ఇది తెలంగాణకు మీరు చేస్తున్న మోసం కాదా? ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేర దాటించ తరిమికొట్టు, ప్రాంతం వాడే మోసం చేస్తే పొలిమేరలోనే బొందపెట్టు’ అని కాళోజీ అన్నడు. మరి మిమ్మల్ని బొందపెట్టాల్నా? ఆంధ్రోడి చేతిలో పాటను పెడితే మీరూ ప్రాంతేతరులే అనుకొని పొరమేర దాటించ తరిమికొట్టాల్నా? ఇంకెన్ని రోజులు గప్‌చుప్‌గా ఉంటరు? తెలంగాణ అస్థిత్వంపై జరిగే దాడిని ఇంకెన్ని రోజులు చూస్తు ఊరుకుంటరు?

- శివవాణి



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్