Opinion : బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. సగటు హిందువుగా నా ఆలోచన ఇదీ..

బీజేపీకి ఎందుకు ఓటేయాలి? దేశాన్ని అభివృద్ధి చేసిందా? అని కొందరి ప్రశ్న. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నందుకా? అని ఇంకొందరి ప్రశ్న. నా సమాధానం ఒక్కటే.. నేను హిందువును.. నేను హిందువును..! ఈ మాట గర్వంగా చెప్పుకోవడానికి నాకు 70 ఏళ్లు పట్టింది.

vote for bjp
ప్రతీకాత్మక చిత్రం

బీజేపీకి ఎందుకు ఓటేయాలి? దేశాన్ని అభివృద్ధి చేసిందా? అని కొందరి ప్రశ్న. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నందుకా? అని ఇంకొందరి ప్రశ్న. నా సమాధానం ఒక్కటే.. నేను హిందువును.. నేను హిందువును..! ఈ మాట గర్వంగా చెప్పుకోవడానికి నాకు 70 ఏళ్లు పట్టింది. ఈ 70 ఏళ్లలో.. ‘‘మనం హిందువులం’’ అని అంటే తోటి హిందువే నవ్వేంత దారుణ స్థితికి పడిపోయాం. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ మాట అక్షర సత్యం. కానీ, ఇప్పుడు సగర్వంగా చెప్పుకొంటుంటే కొందరు మతచాంధసవాది అని ముద్ర వేస్తున్నారు. మరి.. సర్టిఫికెట్లలో ఎందుకు మతం పేరు చేర్చారు? ప్రపంచమంతా ఆ మతం వారు అంత మంది ఉన్నారు.. ఈ మతం వారు ఇంత మంది ఉన్నారు.. అని గొప్ప గొప్ప సంస్థలు ఎందుకు సర్వేలు చేస్తున్నాయి? మతం లేనిదే ఇవన్నీ చేస్తాయా? అంటే ఏ ఒక్కరూ సమాధానం చెప్పరు. లౌకికవాదులుగా చెప్పుకొనే ఎంతోమంది, కమ్యూనిస్టులం అని ఎర్ర జెండా కప్పుకొనేవాళ్లూ చెప్పరు. ఎందుకంటే వాళ్లకు ఆ జ్ఞానం ఎక్కడిది?

‘మేమూ హిందువులమే. మేం బీజేపీ మాదిరి రాజకీయం చేశామా?’ అని కొందరు అంటారు. కానీ, బీజేపీ చేసే రాజకీయం.. దాక్కొని చేసేదో, లౌకికవాద ముసుగు వేసుకొని చేసేదో కాదు. మేనిఫెస్టోలో ధైర్యంగా ప్రకటించిన సిద్ధాంతం ఆ పార్టీది. బాజాప్తా.. రామమందిరం నిర్మిస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు నెరవేర్చింది. ఆ అయోధ్య రాముడిని చూస్తే చాలదా.. 500 ఏళ్ల కల నెరవేరింది అని మనసును హాయి చేసుకోవటానికి. ఇక, దేవుడి దర్శనానికి వస్తే జేబు గుల్ల చేసుకోవాల్సిందేనన్న సంగతి మనకు తెలియనిది కాదు. కానీ, ఇప్పుడిప్పుడే.. ఆలయాల్లో మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అన్న చైతన్యం వస్తోంది. ఒకనాడు రాజులు, సంపన్నులు.. పేదల కడుపు నింపేందుకు ఆలయాలకు విరాళాలు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు పేదలను పిప్పి చేస్తున్న ఆలయాలు ఎన్ని లేవు? ఈ సంస్కృతిని తెచ్చింది 70 ఏళ్లు పాలించిన పాలకులు కాదా? ఎండోమెంట్ బోర్డు ఎందుకు తెచ్చారో తెలియనిదా? మదర్సాలు, మసీదులు, చర్చిలకు లేని బోర్డు హిందువుల ఆలయాలకే ఎందుకు? అన్న ఆలోచన మొదలైంది. దీనికీ ఓ మంచి సందర్భం రాకపోదు.

ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే.. డబ్బు సంపాదించటం ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ, ఆత్మగౌరవం అంతకన్నా ముఖ్యం. ఆ ఆత్మగౌరవం కోసమే యుద్ధాలు జరిగాయి. ఆ ఆత్మగౌరవం కోసమే హత్యలు జరిగాయి. ఇక్కడా.. హిందువులు కోరుకుంటున్నదీ ఆత్మగౌరవమే. ‘మాకు ఆత్మగౌరవం కావాలి.. ఇప్పుడు మా ఆత్మగౌరవం నిలబడింది’ అని హిందువులు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి కారణం.. బీజేపీ. దానికి కారణం.. మోదీ. ప్రపంచ దేశాల మందు సగర్వంగా నిల్చొనే స్థాయికి తీసుకెళ్లింది మోదీయే. అందులో నో డౌట్. ఇది కొందరికి చేదుగా అనిపించొచ్చు. కానీ, కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. ఏ దేశాధినేత అయినా సరే.. మోదీ కనిపిస్తే ఆయనతో ఓ షేక్ హ్యాండ్ ఇవ్వాలని పరితపిస్తారు. అది చాలదా.. నా ఆత్మ సంతృప్తికి. నాకు ఒక పూట తిండిలేకపోయినా ఫర్వాలేదు. కానీ, ఆత్మసంతృప్తి ఎన్నో రోజులు కడుపు నిండినంత. కొన్నేళ్ల క్రితం విదేశాల్లో మనవాళ్లను చిన్నచూపు చూశారు. కానీ, ఇప్పుడు భారతీయులు అంటే చేతులెత్తి మొక్కుతున్నారు. దానికి కారణం ఎవరు?

20 ఏళ్లుగా గల్ఫ్‌లో ఉండే ఓ సోదరుడు అక్కడ మోదీ హయాంలో భారతీయత ఏ స్థాయికి చేరిందో చెప్తే ఒళ్లు గగుర్పొడిచింది. సగటు హిందువుగా నాకు ఇది మరింత ఆత్మసంతృప్తి. యనొక్కడు చెప్తే, మోదీ అభిమాని అనుకొనేవాడిని. కానీ, గల్ఫ్ సోదరులంతా ఇదే మాట చెప్తున్నారు. ముస్లింల దేశంలో గుడిని చూసి మోదీ హవా ఇదీ అని వారు చెప్పడం సంతోషాన్నిచ్చింది. ఆ గుడి కట్టడానికి కారకులు ఎవరు? అన్నదానితో నాకు సంబంధం లేదు. మోదీ ప్రధానిగా ఉండగా, ఆలయం ప్రారంభించారు.. అంతేచాలు. ఇక.. బోర్డర్‌లో దేశం కోసం కాపలా కాస్తున్న ఓ ఆర్మీ సైనికుడు చెప్పిన మాట ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతోంది. మోదీ వచ్చాకే తమకు ఫ్రీడం పెరిగిందని, శత్రుమూకలు దాడిచేస్తే వెంటనే ప్రతిదాడి చేసే ధైర్యం బీజేపీ సర్కారు వచ్చాకే కలిగిందని ఆయన చెప్పారు. అంతకుముందు.. శత్రు దేశం దాడి చేస్తే, ప్రతిదాడి చేయాలా? వద్దా? అన్న సంకోచంలో పడి, తుపాకీ ఎత్తలేక ఎంతో మంది సైనికులు ప్రాణాలు అర్పించారు. కానీ, ఇప్పుడలా లేదు పరిస్థితి. దెబ్బకు దెబ్బ తీయటమే అసలైన ధర్మం. ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయాయి. దెబ్బకు దెబ్బ తీయటమే. ఇదే హిందూ ధర్మం నేర్పిన సిద్ధాంతం. ఇదే భగవద్గీత నేర్పిన పాఠం. యస్మిన్ యదావర్తితవ్యో యోమానుష్యాః తస్మిన్ తదావర్తితవ్యం సధర్మః మయాచరో మాయాయవారారేణః సఅధ్వచారః సాధునా ప్రత్యుపేయః.. అంటే ఎవడు నీతో ఎలా ప్రపర్తించాడో, తిరిగి వాడితో నువ్వు అలాగే ప్రపర్తించు. అదే ధర్మం. ఆ ధర్మానుసారమే భారతదేశంలో పాలన కొనసాగుతోంది. అందుకే నా ఓటు నా బీజేపీకే.

- బీఎస్కే

వెబ్ స్టోరీస్