అమెరికా ఎన్నికల వేళ చంద్రబాబుపై మీమ్స్.. బాబు లేకుండా ట్రంప్, కమల గెలవగలరా? అని సెటైర్లు

అమెరికా అంటే అమలాపురం.. ఆంధ్రప్రదేశ్ అంటేనే అమెరికా అన్నట్లు ప్రచారం చేసుకునే చంద్రబాబు లేకుండా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

chandrababu trump
చంద్రబాబు, ట్రంప్, కమలా హారిస్

ఈవార్తలు, సోషల్ టాక్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నేటితో ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. అయితే, ఇంత సీరియస్ మ్యాటర్ నడుస్తుండగా.. కొందరు నెటిజన్లు వెరైటీగా స్పందిస్తూ చంద్రబాబుపై మీమ్స్ పేలుస్తున్నారు. అమెరికా అంటే అమలాపురం.. ఆంధ్రప్రదేశ్ అంటేనే అమెరికా అన్నట్లు ప్రచారం చేసుకునే చంద్రబాబు లేకుండా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అమెరికాలో చంద్రబాబుకు ఉన్న ప్రజాదరణను ట్రంప్, కమలా హారిస్ వాడుకోవడం లేదని.. వారిద్దరిలో ఎవరు గెలవాలన్నా చంద్రబాబు ప్రమేయం ఉండాల్సింది కదా అంటూ జోకులు వేస్తున్నారు. గతంలో ఓ వర్గం మీడియా.. చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని, అమెరికా ఎన్నికల్లోనూ చక్రం తిప్పగల సమర్థుడు అని వేనోళ్ల పొగిడిందని.. మరి అంత సీరియస్‌గా అమెరికా ఎన్నికలు జరుగుతుంటే.. చంద్రబాబు లేకుండా ట్రంప్, కమల ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారని కొంటెగా వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు గొప్పదనం ట్రంప్, కమలా హ్యారిస్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలే అన్నంత బిల్డప్ ఇచ్చే ఓ వర్గం.. చంద్రబాబును ట్రంప్, కమల వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని ట్రోల్ చేస్తున్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసినట్టు చూపించిన ఓ మీడియా.. ఇప్పుడు చంద్రబాబు ప్రమేయాన్ని ఎందుకు విస్మరిస్తున్నదని ఆడుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రతి తెలుగు వార్త కామెంట్లలో ఇవే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. నెటిజన్లు చంద్రబాబు జపం చేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ శ్రేణులే ఈ ట్రోల్స్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. 

కాగా, అమెరికాలో తెలుగువాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువే. దాదాపు 12.3 లక్షల మంది తెలుగువాళ్లు అమెరికా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఒక్క కాలిఫోర్నియాలోనే 2 లక్షల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. టెక్సస్‌లో 1.5 లక్షల మంది, న్యూజెర్సీలో 1.1 లక్షల మంది, ఇల్లినాయిస్‌లో 83 వేల మంది, వర్జీనియాలో 73 వేల మంది, జార్జియాలో 52 వేల మంది తెలుగువాళ్లు నివాసం ఉంటున్నారు. వీరిలో ఎక్కువగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాళ్లే అధికం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్