Ramasethu | రాముడు కట్టిన రామసేతు నిజమే.. 17 లక్షల ఏళ్ల క్రితమే నిర్మాణం జరిగిందట..

భారత్ - శ్రీలంక మధ్య రామసేతు Ramasethu వంతెన కల్పితం కానేకాదని.. నిజంగానే ఉందని ఇస్రో స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం సహాయంతో వంతెన మ్యాప్‌ను విడుదల చేసింది.

ramasethu
రామసేతు

భారత్ - శ్రీలంక మధ్య రామసేతు Ramasethu వంతెన కల్పితం కానేకాదని.. నిజంగానే ఉందని ఇస్రో స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం సహాయంతో వంతెన మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్, శ్రీలంక మధ్య 29 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన.. సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తు వరకు సున్నపురాయితో నిర్మించినట్లు నిర్ధారించారు. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు ఉన్నట్లు వివరించింది. భారత్‌లో ఈ వంతెనను రామసేతు అని, శ్రీలంకలో అడాంగ పాలం అని పిలుస్తారు. ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. స్వయంగా శ్రీరాముడు ఈ వంతెనను నిర్మించాడని పురాణాలు చెప్తుంటే.. సముద్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిందని కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ వంతెన వయసు సుమారు 17 లక్షల సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

రామాయణ వెర్షన్ ఇలా..

రావణుడు సీతను అపహరించడంతో ఆమెను కాపాడి తీసుకొచ్చేందుకు వానర సైన్యంతో కలిసి రాముడు రాళ్లతో ఈ వంతెనను నిర్మించాడు. పరిశోధకుల అంచనా ప్రకారం.. పగడపు, సిలికా రాళ్లు వేడెక్కి వాటిలోకి గాలి చేరి అవి తేలికగా మారి నీటిపై తేలుతాయని, అలాంటి రాళ్లతోనే ఈ వారధి నిర్మించారని కొందరు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు కూడా వంతెన నిర్మాణంపై క్లారిటీ ఇచ్చారు. ఇది నిర్మించినదేనని, సహజసిద్ధంగా ఏర్పడినది కాదని ప్రకటించారు. ఈ వంతెన ప్రాంతంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. 2004లో వచ్చిన సునామీని సైతం రామసేతు తట్టుకొని నిలబడింది. రామేశ్వరం ప్రాంతంలో కొన్ని రాళ్లు తేలియాడుతూ కనిపిస్తాయి. వాటిని చూడ్డానికి చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. 

నాసా ఏం చెప్పిందంటే..

రామసేతుపై పరిశోధనలు చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా).. శాటిలైట్ల ద్వారా తీసిన ఫొటోల్లో 30 కిలోమీటర్ల పొడవున రాళ్లు పేర్చి ఉన్నట్లుగా కనిపిస్తోందని వెల్లడించింది. ఇది మానవ నిర్మితమేనని మాత్రం నాసా ధ్రువీకరించలేదు. మరోవైపు 2017 డిసెంబర్‌లో అమెరికా సైన్స్ చానల్.. మానవ నిర్మితమేనని చెప్పి సంచలనం సృష్టించింది. మరోచోటు నుంచి ఈ రాళ్లను తీసుకొచ్చి కట్టారని వెల్లడించింది. ఇసుక 4 వేల ఏళ్ల నాటిదని.. రాళ్లు మాత్రం 7 వేల ఏళ్ల నాటివని తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్