RTI కింద సమాచారం కోరేవారు దరఖాస్తు ఎలా రాయాలంటే..

ప్రభుత్వం నుంచి ఏ సమాచారం రాబట్టుకోవాలన్న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పనిలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, పారదర్శకతను అమలు చేయడానికి కేంద్రం సమాచార హక్కు చట్టాన్ని 2005 అక్టోబర్ 12న అమల్లోకి తెచ్చింది.

rti act

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు ఇన్ఫర్మేషన్ : ప్రభుత్వం నుంచి ఏ సమాచారం రాబట్టుకోవాలన్న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పనిలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, పారదర్శకతను అమలు చేయడానికి కేంద్రం  సమాచార హక్కు చట్టాన్ని 2005 అక్టోబర్ 12న అమల్లోకి తెచ్చింది. అయితే, దరఖాస్తును ఎలా రాయాలి? అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఏ భాషలో రాయాలి? ఇంగ్లిష్‌లోనే రాయాలా? అన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అయితే, దరఖాస్తు రాయకపోయినా ఆర్టీఐ నుంచి సమాచారం ఎలా పొందాలి? అన్న అనుమానాలూ కలుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి సమాచార హక్కు చట్టం ప్రకారం.. సమాచారం కోరే వ్యక్తులు సంబంధిత కార్యాలయంలో ప్రజా సమాచారం, సహాయ ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు అంటే ప్రత్యేకంగా ఏ ఫారం అవసరం లేదు. తెల్ల కాగితంపై వివరాలు కోరుతూ విజ్ఞప్తిని సమర్పిస్తే చాలు.

ఒకవేళ రాయడం రాకపోయినా ఫర్వాలేదని చట్టం చెప్తోంది. లిఖిత పూర్వకంగా దరఖాస్తు ఇవ్వలేనివారు.. సంబంధిత సమాచార అధికారికి మౌఖికంగా (నోటితో) వివరిస్తే దాన్ని సదరు అధికారి లిఖిత పూర్వకంగా రాస్తారు. భాష విషయానికి వస్తే చట్టంలో పలు చోట్ల స్థానిక భాషలో అని ఉంది. అంటే.. మన రాష్ట్ర అధికారిక భాష తెలుగులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ, తెలుగులో దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంది అని అర్థం. 

దరఖాస్తు రుసుం ఇలా..

-  తెల్లకార్డు ఉన్న పేదలకు, గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికి దరఖాస్తు రుసుం ఉండదు.

- మండలస్థాయిలో రూ.5, జిల్లా స్థాయిలో రూ.10కి మించి వసూలు చేయరాదు. సమాచారానికి అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారు నుంచి వసూలు చేయవచ్చు.

- సమాచారం అడిగి నెల (30 రోజులు) దాటితే ఏ సమాచారాన్నైనా ఉచితంగా అందజేయాలి.

- సమాచారం ముద్రణ రూపంలో కావాలంటే.. ప్రతి పేజీకి రూ.2 చొప్పున ఖర్చులు వసూలు చేస్తారు. తపాలా ఖర్చులను కూడా దరఖాస్తుదారు చెల్లించాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్