whatsapp: నెట్ లేకున్నా వాట్సాప్ ఫైల్స్ షేర్ చేసుకోవచ్చ..ఎలాగో తెలుసా?

ఇక నుంచి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా?

whatsapp

ప్రతీకాత్మక చిత్రం 

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు ఉన్నారు. తమ వినియోగదారుల కోసం నిత్యం ఏదొక ఫీచర్ ను అందుబాటులోకి తీసువస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా వినియోగదారులు ఫైల్‌లను షేర్ చేయడానికి ఉపయోగించే క్విక్ షేర్ అనే కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను వాట్సాప్ ఇటీవల పరీక్షించింది.అంటే ఇక నుంచి నెట్ అవసరం లేకుండానే ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య వైర్‌లెస్‌గా ఫైల్‌లను షేర్ చేయడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది.దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

అయితే ఇది ప్రస్తుతం డెవలప్ స్టేజ్ లో ఉంది.  ఫైల్ షేరింగ్‌ను గతంలో కంటే సులభతరం చేస్తామని వాట్సాప్ తెలిపింది. వీటిని షేర్  చేసుకునేందుకు ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది మీ ఫోన్ బ్లూటూత్, సమీపంలోని పరికర సామర్థ్యాలను ఉపయోగించి సురక్షితంగా పని చేస్తుంది.WeBetaInfo సైట్ వాట్సాప్ బీటా ఫీచర్‌ల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్ గురించి సమాచారం అందించింది. ఈ వారం వాట్సాప్ యొక్క iOS బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ గుర్తించింది. ఇందులో నియర్‌బై షేర్ అనే టూల్ ఉందని వెల్లడించింది.

Wi-Fi డైరెక్ట్ ఫీచర్‌ని ఉపయోగించి అన్ని మీడియా కంటెంట్, డాక్యుమెంట్‌లు, ఇతర ఫైల్‌లను షేర్ చేయడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అందువల్ల ఇది ఇద్దరు ఐఫోన్ వినియోగదారుల మధ్య ఉపయోగించవచ్చు.  ఆండ్రాయిడ్,ఐఫోన్ వినియోగదారుల మధ్య ఫైల్‌లను కూడా పంచుకోవచ్చు. Apple ఫోన్‌ని ఉపయోగిస్తున్న iOS WhatsApp వినియోగదారుల కోసం Nearby Shareతో ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఫైల్‌ల బదిలీని ప్రారంభించడానికి ఇతర వినియోగదారు స్కాన్ చేయాల్సిన QR కోడ్ వారి ఫోన్‌లో కనిపిస్తుంది.ఐఫోన్‌లోని నియర్‌బై షేర్ ఫీచర్‌ని ప్రస్తుతం అంతర్గత టెస్టింగ్ టీమ్ మాత్రమే ఉపయోగిస్తోంది. మెటా త్వరలో ఐఫోన్ వాట్సాప్ వినియోదారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్