Warning : షియోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లలో ప్రమాదకర వైరస్‌

షియోమీ సహా రెడ్‌మీ Redmi, పోకో poco స్మార్ట్‌ఫోన్లలో ప్రమాదకర వైరస్‌లు గుర్తించామని వెల్లడించారు. ఈ వైరస్‌తో వినియోగదారుల డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపారు.

redmi mobiles
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు టెక్ న్యూస్: షియోమీ xiaomi కంపెనీ ఫోన్లు వాడుతున్నారా? అయితే ఆ ఫోన్లలో ప్రమాదకర వైరస్ ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. షియోమీ సహా రెడ్‌మీ Redmi, పోకో poco స్మార్ట్‌ఫోన్లలో ప్రమాదకర వైరస్‌లు గుర్తించామని వెల్లడించారు. ఈ వైరస్‌తో వినియోగదారుల డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ఫోన్లలో ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య దాదాపు 20 భద్రత లోపాలు, సమస్యలను గుర్తించామని వెల్లడించారు. ఈ లోపాలకు సంబంధించిన వివరాలను ఓవర్ సెక్యూర్డ్ అనే బ్లాగ్‌లో ప్రచురించారు.

ఎంఐయూఐ, హైపర్‌ ఓఎస్‌ వినియోగించే ఫోన్లలో భద్రతాపరమైన లోపాలు, సమస్యలు ఉన్నట్టు సైబర్ నిపుణులు తెలిపారు. జియోమీ ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్ట్‌ యాప్‌(AOSP)లో లోపాలు ఉన్నాయని, వీటిని వెంటనే సరిచేయాలని సూచించారు. అయితే,  ఈ లోపాలపై షియోమీ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.

 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్