సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగానూ రాత్రి ఎక్కువగానూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వేసవిలో భూమి సూర్యునికి దగ్గరగా, శీతాకాలంలో భూమి సూర్యునికి దూరంగా కక్ష్య దిశలో ప్రయణిస్తుంటుంది. ఈ ప్రక్రియను వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటుంటాం. ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ 21న ఓ వింత జరగబోతోంది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు: ఈ నెల 21న (శనివారం) అంతరిక్షంలో అసలు ఏం జరగబోతుంది? ఎందుకని ఆ రోజున సూర్యునికి సుదూరంగా భూమి పయనిస్తుంది? ఈ రోజు పగలు 8 గంటలు, రాత్రి 16 గంటలు ఉండనుందా? ఈ వింత ఒక అద్భుతం అనుకోవాలా? లేక ప్రపంచానికే ఒక అలర్ట్ అనుకోవాలా? అసలు వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటే ఏమిటి? దీనిపై పరిశోధకుల మాట ఏంటి? ఈ విషయాలు అన్ని క్లుప్తంగా తెలుసుకుందాం.
సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగానూ రాత్రి ఎక్కువగానూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వేసవిలో భూమి సూర్యునికి దగ్గరగా, శీతాకాలంలో భూమి సూర్యునికి దూరంగా కక్ష్య దిశలో ప్రయణిస్తుంటుంది. ఈ ప్రక్రియను వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటుంటాం. ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ 21న ఓ వింత జరగబోతోంది. ఈ రోజు సుదీర్ఘమైనా రాత్రి ఏర్పడబోతుంది. అవును మీరు విన్నది అక్షరాలా నిజం. ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం ఉంటే, పగలు సమయం మాత్రం 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగటాన్ని శీతాకాలపు అయనాంతం అంటారు. దీనినే ఇంగ్లిష్‌లో WINTER SOLSTICE అంటారు. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున భూమి సూర్యునికి దూరంగా ఉంటుంది. ఆ రోజున భూమి ద్రువం వద్ద.. 23.5 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగానే 2024 డిసెంబర్ 21న అత్యంత తక్కువ సమయం పగలు సూర్యకాంతి 8 గంటలు, చంద్రుడు కాంతి 16 గంటలు వరకు ఉంటుంది.
భూమి తన కక్ష్య వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి, సూర్యుని మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనినే భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఆ రోజు భూమికి, సూర్యునికి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడేదాన్నే అయనాంతం అంటారు. మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యంత లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బిందువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో పొడవైన రోజు వేసవి కాలపు అయనాంతం, అతి తక్కువ రోజు శీతాకాలపు అయనాంతం. ఇది ప్రతీ సంవత్సరం రెండుసార్లు జరిగే ప్రక్రియ. సంవత్సరం పొడువునా ఉత్తరం లేదా దక్షిణ అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. వేసవి కాలపు అయనాంతం సంవత్సరంలో ఉండే అత్యంత పొడవైన రోజు. ఈ అయనాంతాలపై ప్రజలు కొన్ని సెంటిమెంట్లను కూడా నమ్ముతుంటారు.
ముఖ్యంగా శీతాకాలంలో ఏర్పడే అయనాంతాలపై చాలా దేశాలలో ప్రజలు పలు రకాల నమ్మకాలను పాటిస్తుంటారు. ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్‌తో పాటు పలు ప్రాంతంలో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఉంది. దీని గురించి ఎవరు, ఎన్ని మాట్లాడుకున్న వాస్తవానికి భూ భ్రమణంలో సూర్యుడు, భూమి మధ్య దూరం ఏడాదిలో ఒక్కసారి పెరగడం, తగ్గడం జరుగుతుంది. వేసవిలో సూర్యునికి దగ్గరగానూ, శీతాకాలంలో సూర్యునికి దూరంగానూ భ్రమణం చెందుతూ ఉంటుంది. అయితే ఈ శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కానీ కచ్చితంగా డిసెంబర్ 20 నుంచి 23 తేదీలలోపు మాత్రమే వస్తుంది. ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైప ఘట్టం సంభవిస్తోంది అని పరిశోధకులు వెల్లడించారు. దీంతో సూర్య కిరణాలు అత్యల్పంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఆ రోజు ఉష్ణోగ్రతలో మార్పులు సంభవించి దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంటుదని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.