Cars And Suvs: ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 750కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించే కార్లు ఇవే

ఇండియాలో కార్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. చాలా చాలా కార్లు వాటి ఇంధన సామర్థ్యం కారణంగా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తాయి.ఈ కార్లు ఫుల్ ట్యాంక్ ఇంధనంపై అద్భుతమైన పనితీరును చూపుతాయి. అలాంటి కొన్ని కార్లు, SUVల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 Cars And Suvs

ప్రతీకాత్మక చిత్రం 

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.  దేశీయ, విదేశీ కార్లు భారతీయ రహదారులను శాసిస్తున్నాయి. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా కార్లు కూడా వాటి పెరుగుదల ద్వారా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కార్ల విషయానికి వస్తే ఇంధన సామర్థ్యం కూడా ముఖ్యం. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా చూసేది ఎంత మైలేజీ ఇస్తుందని. అదేవిధంగా, ఫుల్ ట్యాంక్ ఇంధనంతో 750 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించే భారతీయ కార్లు, SUVలను చూద్దాం.

మారుతి సుజుకి స్విఫ్ట్:

మారుతి సుజుకి ఇటీవలే భారత కార్ మార్కెట్‌కు న్యూజనరేషన్ స్విఫ్ట్‌ను పరిచయం చేసింది. మారుతి సుజుకి ఫేమస్ మోడళ్లలో స్విఫ్ట్ ఒకటి. స్విఫ్ట్ పూర్తి ట్యాంక్ పరిధి సుమారు 950 కి.మీ. AMT వేరియంట్‌లో దీని ఇంధన సామర్థ్యం 25.75 kmpl. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 37 లీటర్లు. స్విఫ్ట్ 1.2-లీటర్, 3 సిలిండర్, NA పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

టాటా నెక్సాన్ డీజిల్:

ఈ జాబితాలో ఉన్న మరో కారు టాటా నెక్సాన్ డీజిల్. ఫుల్ ట్యాంక్‌పై దీని క్లెయిమ్ పరిధి దాదాపు 1050 కి.మీ. డీజిల్ వేరియంట్‌లో దీని ఇంధన సామర్థ్యం 24 kmpl. దీని ఇంధన ట్యాంక్ నిల్వ సామర్థ్యం 44 లీటర్లు. టాటా నెక్సాన్ డీజిల్ 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో వస్తుంది.

మహీంద్రా XUV 3XO:

మరొక ప్రసిద్ధ భారతీయ కంపెనీ మహీంద్రా & మహీంద్రా కంపెనీకి చెందిన కొత్త SUV XUV 3XO కూడా దాని ఇంధన సామర్థ్యంతో దృష్టిని ఆకర్షిస్తుంది. ఫుల్ ట్యాంక్ ఇంధనంపై ఈ SUV సగటు మైలేజ్ 890 kmph. AMT డీజిల్ వేరియంట్ క్లెయిమ్ చేసిన ఇంధన సామర్థ్యం సుమారు 21.2 kmpl. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 42 లీటర్లు. SUV 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్:

హ్యుందాయ్ క్రెటా,  కియా సెల్టోస్ కూడా మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. క్రెటా డీజిల్ వేరియంట్ 21.8 kmpl ఇంధన సామర్థ్యంతో 1090 kmpl పరిధిని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. అయితే Kia Seltos 20.7 kmpl ఇంధన సామర్థ్యంతో 1035 kmpl రేంజ్‌ను అందిస్తుంది. రెండు SUVలు 50-లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో శక్తిని పొందుతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్