OPPO Phone: రూ.13వేలకే ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్..ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారీ సంస్థ అయిన Oppo K12X 5G ను భారత్ లో లాంచ్ చేసింది. Oppo నుండి విడుదలైన ఈ ఫోన్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లుక్, డిజైన్ చాలా వరకు OnePlus Nord CE 4 లాగా ఉంది.

oppo

ప్రతీకాత్మక చిత్రం 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారీ కంపెనీ ఒప్పో Oppo రూ.13 వేల లోపు ధరకే ఆకట్టుకునే  ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Oppo K సిరీస్‌లో మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్ లుక్, డిజైన్ OnePlus Nord CE 4 లాగా ఉంది. Oppo  ఈ ఫోన్ ఈ ధర శ్రేణిలో వస్తున్న Infinix, Tecno, Vivo, Xiaomi, Redmi వంటి బ్రాండ్ల  తక్కువ ధర ఫోన్‌లకు గట్టి పోటీని ఇవ్వగలదు. Oppo ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

 ధర:

కంపెనీ Oppo K12X 5Gని 6జిబి ర్యామ్ + 128జిబి, 8జిబి ర్యామ్ + 256జీబీ  అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 12,999. అదే సమయంలో, దీని టాప్ వేరియంట్ ధర రూ. 15,999. కంపెనీ ఈ ఫోన్‌ను బ్రీజ్ బ్లూ ,మిడ్‌నైట్ వైలెట్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఈ ఫోన్ మొదటి విక్రయం ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.1,000 వరకు బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది.

ఫీచర్లు:

Oppo K12X 5G 6.67 అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్  డిస్ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 1,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ ఫీచర్‌ సపోర్టు చేస్తుంది. ఫోన్ డిస్ప్లే డ్యూయల్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోన్‌లో గరిష్టంగా 8GB వరకు LPDDR4X RAM, 256GB UFS 2.2 ఆన్‌బోర్డ్  స్టోరేజీ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజీని ఎక్స్ పాండ్ చేసుకోవచచు. 

Oppo యొక్క ఈ ఫోన్ 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనితో, 45W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్‌లో ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనుక భాగంలో 32MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం స్పెషల్ కెమెరా ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ కూడా ఉంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్