Oneplus Green Line Problem | ఈ మధ్య పలు ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్‌డేట్ చేయగానే స్క్రీన్‌పై గ్రీన్ లైన్ కనిపిస్తోంది. ముఖ్యంగా వన్ ప్లస్ మొబైల్ యూజర్లకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కొత్త ఫోన్ కొన్నా.. ఇలా ఎందుకు అయ్యిందో అనుకుంటూ ఆవేదన చెందుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
టెక్ న్యూస్, ఈవార్తలు : ఈ మధ్య పలు ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్‌డేట్ చేయగానే స్క్రీన్‌పై గ్రీన్ లైన్ కనిపిస్తోంది. ముఖ్యంగా వన్ ప్లస్ మొబైల్ యూజర్లకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కొత్త ఫోన్ కొన్నా.. ఇలా ఎందుకు అయ్యిందో అనుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ సంస్థ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జీవితకాలం పాటు ఉచితంగా స్క్రీన్ అప్ గ్రేడ్ ఆప్షన్‌ను అందిస్తోంది. వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ 8 టీ, వన్ ప్లస్ 9, 9ఆర్ వాడే మొబైల్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే.. వన్ ప్లస్ కంపెనీ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఉచితంగా స్క్రీన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. క్లీనింగ్, మెయింటెనెన్స్ సేవలు కూడా పొందవచ్చు. వాస్తవానికి గత ఏడాది నుంచే వన్ ప్లస్ తన యూజర్లకు 10 ఆర్ మొబైల్స్‌పై కంపెనీ వోచర్ ఇస్తోంది. ఇప్పుడు లైఫ్ టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్‌గ్రేడ్ సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఈ ఆఫర్ ఎలా పొందాలంటే.. వన్ ప్లస్ యాప్ ద్వారా రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్‌షిప్ సెక్షన్‌కు వెళ్లి, బెనిఫిట్స్ దగ్గర లైఫ్‌టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్‌గ్రేడ్ అని సెర్చ్ చేసి ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవాలి. అందుకు ఫోన్ కొన్న ఒరిజినల్ బిల్లు దగ్గర ఉంచుకోవాలి. లేకపోతే ఆఫర్ రాదు. క్లెయిమ్ చేసుకున్నాక దగ్గరలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లి స్క్రీన్‌ను అప్ గ్రేడ్ చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.