OnePlus Mobiles | వన్ ప్లస్ ఫోన్ కొనాలనుకొంటున్నారా.. అయితే మీకిది షాకింగ్ న్యూస్

OnePlus Mobiles : మే 1వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు.

oneplus
ప్రతీకాత్మక చిత్రం Photo: Instagram

ఈవార్తలు, టెక్ న్యూస్: యాపిల్ (Apple) ఫోన్ల తర్వాత అత్యంత క్రేజ్ ఉన్న ఫోన్ ఏదంటే.. టక్కున గుర్తొచ్చే పేరు.. వన్ ప్లస్ (OnePlus). ఈ ఫోన్లలో ఫీచర్లు, కెమెరా క్వాలిటీ సూపర్‌గా ఉండటమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా ఒక కోటి మందికి పైగా వన్ ప్లస్ ఫోన్లను వాడుతున్నారు. అందులో 25-34 ఏళ్ల వయస్కులే అధికం. వన్ ప్లస్ ఫోన్లు వాడుతున్నవారిలో 72 శాతం మంది యుక్త వయస్కులే కావటం గమనార్హం. అయితే, ఈ స్థాయిలో వన్ ప్లస్ ఫోన్లు వాడుతుండగా, తాజాగా యూజర్లకు షాకిచ్చే న్యూస్ బయటికి వచ్చింది. వచ్చే నెల నుంచి స్టోర్లలో వన్ ప్లస్ ఫోన్లు బంద్ కానున్నట్లు వార్త రావటమే ఈ షాకింగ్ న్యూస్.

మే 1వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు. ఈ ఫోన్ల అమ్మకాల వల్ల తమకు మార్జిన్లు రాకపోవటమే కాకుండా, తమ సమస్యలను వన్ ప్లస్ యాజమాన్యం పెడచెవిన పెడుతోందని సౌతిండియా ఆర్గనైడ్జ్ రిటైలర్స్ అసోసియేషన్ చెప్తోంది. ఇక నుంచి వన్ ప్లస్ ఫోన్లను అమ్మేది లేదని చెప్తూ వన్ ప్లస్ సేల్స్ డైరెక్టర్‌కు లేఖ రాసింది.

వెబ్ స్టోరీస్